Telugu News » Revanth reddy : ప్లాన్ రెడీ చేయండి..!

Revanth reddy : ప్లాన్ రెడీ చేయండి..!

మూసీలో మురుగు నీటిని ముందుగా శుద్ధి చేయాలని సూచనలు చేశారు.

by Ramu
CM Revanth

నగరంలోని చారిత్రక కట్టడాలను కలుపుతూ వెళ్లేలా మూసీ (Musi River) అభివృద్ధికి ప్రణాళికలు రెడీ చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి (Revanth reddy) ఆదేశించారు. మూసీలో మురుగు నీటిని ముందుగా శుద్ధి చేయాలని సూచనలు చేశారు.

Telangana CM for early start to Musi Riverfront development work

నగరంలోని మూసీ నది అభివృద్ధి ప్రక్రియను వీలైనంత త్వరగా ప్రారంభించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. మూసీ ప్రక్షాళన, పరీవాహక అభివృద్ధిపై నానక్​రాంగూడలోని హెచ్ఎండీఏ కార్యాలయంలో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

మూసీ సరిహద్దులు, ఇతర వివరాలతో కూడిన మ్యాపులను ఈ సందర్బంగా సీఎంకు అధికారులు వివరించారు. అధికారులు పని విభజన చేసుకొని మూసీ పరీవాహక అభివృద్ధికి చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. సమీక్షలో హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు దానకిశోర్, ఆమ్రపాలి తదితరులు పాల్గొన్నారు.

అంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చినజీయర్ స్వామి కలిశారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఇద్దరు భేటీ అయ్యారు. సమత కుంభే పేరుతో నిర్వహించనున్న రామానుజాచార్య 108 దివ్య దేశాల ద్వితీయ బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డిని చినజీయర్ స్వామి ఆహ్వానించారు. రామానుజ జీవిత విశేషాలను సీఎంకు చినజీయర్ స్వామి వివరించారు.

You may also like

Leave a Comment