Telugu News » spy satellite : స్పై శాటిలైట్…!

spy satellite : స్పై శాటిలైట్…!

ఈ ఏడాది ఏప్రిల్‌లోగా దీన్ని స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

by Ramu
Indias first spy satellite made by local private player set for SpaceX liftoff

-దేశంలో తొలి గూఢచార ఉపగ్రహం
-నిర్మిస్తున్న టాటా కంపెనీ
-స్పేస్ ఎక్స్ ద్వారా అంతరిక్షంలోకి
-బెంగళూరులో గ్రౌండ్ కంట్రోల్ సెంటర్

భారత్ తన మొదటి గూఢచార శాటిలైట్‌ (spy satellite )ను ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దేశానికి చెందిన టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL) కంపెనీ ఈ శాటిలైట్‌ను నిర్మించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లోగా దీన్ని స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇప్పటికే ఈ శాటిలైట్‌ను లాంఛింగ్ కోసం కంపెనీ ఫ్లోరిడాకు పంపించినట్టు సమాచారం. రహస్య సమచారాన్ని సేకరించడంలో సైన్యానికి ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ శాటిలైట్ కోసం బెంగళూరులో ఓ గ్రౌండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నట్టు కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.

దీనికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. త్వరలోనే ఈ గ్రౌండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. లాటిన్-అమెరికన్ కంపెనీ అయిన శాటెలోజిక్ భాగస్వామ్యంతో ఈ కేంద్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.

శాటిలైట్ పంపించిన చిత్రాలను మార్గ నిర్దేశం చేసేందుకు, ప్రాసెస్ చేసేందుకు ఉపయోగించబడుతుందని పేర్కొంది. టీఏఎస్ఎల్ ఉపగ్రహం ద్వారా పంపబడిన చిత్రాలను మిత్ర దేశాలతో పంచుకునేందుకు అనుమతించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

You may also like

Leave a Comment