తెలంగాణ (Telangana)లో లక్ష కోట్లతో నిర్మించిన ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ప్రస్తుతం ఆగమ్యగోచారంగా మారిందని అంటున్నారు. ఇప్పటికే బ్యారేజీ కుంగిన చోట పిల్లర్లకు ఏం జరిగిందో తెలుసుకోవడానికి కాఫర్ డ్యాం నిర్మాణం చేపట్టాల్సి ఉందని.. ఇందుకు రూ.55.75 కోట్లు ఖర్చు అవుతుందని, ఎల్‌అండ్‌టీ ఈ నెల 2న కాళేశ్వరం ENC వెంకటేశ్వర్లు (Venkateshwar)కు లేఖ రాసిన విషయం తెలిసిందే..
మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా కలిపించాలని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెగ గడబిడ చేశారు.. కుంగిపోయే ప్రాజెక్ట్ కి జాతీయహోదా ఇవ్వాలని చెప్పడం బీఆర్ఎస్ పాలకుల అజ్ఞానానికి నిదర్శనం అనే విమర్శలు వినిపిస్తోన్నాయి.. కాళేశ్వరం పేరుతో లక్ష కోట్ల అవినీతి జరిగింది అనేది కళ్ళకి కట్టినట్టు కనిపిస్తున్నా.. ఈ అంశంపై కేంద్రం అంటీఅంటనట్టు వ్యవహరించడం రాజకీయంగా చర్చకి దారితీస్తోంది. రాష్ట్ర బడ్జెట్ ని బకాసురిడిలా ఖాళీ చేసిన కాళేశ్వరం ప్రాజెక్ట్ పై మరోసారి రూ.55.75 కోట్లు ఖర్చు చేయడం రాష్ట్రాన్ని ఆగాధంలోకి నెట్టినట్టే అనే అభిప్రాయాలు వెల్లువెత్తుతోన్నాయి..
మరోవైపు కేసీఆర్ (KCR) ఇష్టపడి నిర్మించుకొన్న ఫామ్ హౌస్ పై పెట్టిన శ్రద్ధ కాళేశ్వరం (Kaleshwaram)పై పెడితే ఈ దుస్థితి వచ్చేది కాదుకదా అనే వాదనలు వినిపిస్తోన్నాయి.. ఇదే సమయంలో తెలంగాణ సీఎం వ్యూహాత్మకంగా వ్యవహరించారనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.. తాము ప్రతివ్రతలమని చెప్పుకొంటోన్న గులాబీ నేతల గువ్వ గుయ్ మనేలా రేవంత్ రెడ్డి (Revanth Reddy) కాళేశ్వరం ప్రాజెక్టుపై సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించారు.
అయితే ఇక్కడ రేవంత్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కక్ష సాధింపు అని అనిపింకుండా.. కవితనే విచారణకు డిమాండ్ చేసినట్లగా క్రియేట్ చేసి.. కవిత కోరినట్లుగా విచారణకు ఆదేశిస్తున్నామని ప్రకటించడంతో.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Kavitha) గతుక్కుమనాల్సి వచ్చింది. తాను వదిలిన బాణం తననే గుచ్చుకోవడంతో.. తెలంగాణ ఆడపడుచు అని చెప్పుకొంటున్న లిక్కర్ రాణికి గొంతులో వెలక్కాయపడ్డట్టు అయ్యిందని అనుకొంటున్నారు..
మరోవైపు ఎన్నికల ప్రచారంలో కాళేశ్వరం అవినీతి మొత్తాన్ని బయటకు కక్కించి.. ఆ డబ్బులను ప్రజలకు పంచుతామని రేవంత్ రెడ్డితో పాటు రాహుల్ గాంధీ ప్రకటించారు. అయితే కక్ష సాధింపుల లా కాకుండా..ఇలా కవితను ఇరికిస్తూ.. విచారణకు ఆదేశించిన రేవంత్ రాజకీయ చతురతకి కాంగ్రెస్ వర్గాలు ఫిదా అవుతున్నాయని అనుకొంటున్నారు..