Telugu News » Telangana Elections: సీఎం కేసీఆర్‌కు నామినేషన్ల బెడద.. ఏకంగా 100మంది టార్గెట్..!

Telangana Elections: సీఎం కేసీఆర్‌కు నామినేషన్ల బెడద.. ఏకంగా 100మంది టార్గెట్..!

కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌పై పోటీగా 100 నామినేషన్లు వేస్తామని పౌల్ట్రీ రైతులు గురువారం వెల్లడించారు. జిల్లా కేంద్రంలో పౌల్ట్రీ రైతుల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

by Mano
KCR who stood at the top in Janagraha

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు(Telangana Assembly Elections) రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన ప్రధాన పార్టీలు క్షణం తీరిక లేకుండా ప్రచారాల్లో నిమగ్నమయ్యారు. సీఎం కేసీఆర్‌(CM KCR) అయితే రోజుకో మూడు సభలతో ఫుల్ బిజీ అయిపోయారు. కేసీఆర్ కామారెడ్డి(Kamareddy), గజ్వేల్‌(Gajwel)లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సీం కేసీఆర్‌కు ఇప్పుడు నామినేషన్ల భయం పట్టుకుంది. ఏకంగా 100మంది ఆయనపై పోటీకి సిద్ధమయ్యారు.

cm kcr

కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌పై పోటీగా 100 నామినేషన్లు వేస్తామని పౌల్ట్రీ రైతులు గురువారం వెల్లడించారు. జిల్లా కేంద్రంలో పౌల్ట్రీ రైతుల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కాయితి లంబాడీలు 1016 నామినేషన్లు వేస్తామని ప్రకటించారు. నిరుద్యోగులు సైతం నామినేషన్లు వేస్తామని ప్రకటించడం సంచలనంగా మారింది.

చికెన్ సెంటర్స్ అసోసియేషన్, ట్రేడర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పౌల్ట్రీ రైతులకు పూర్తి మద్దతు ప్రకటించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఓన్ ఫార్మర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు వెంకట్ రావు, ఇంటిగ్రేటెడ్ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. కార్పొరేట్‌ పౌల్ట్రీ నిర్వాహకులతో పౌల్ట్రీ రైతులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. పౌల్ట్రీ రంగాన్ని పూర్తిగా వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు.

రైతాంగానికి ఉచిత కరెంట్ ఇస్తున్నట్లుగానే పౌల్ట్రీ రంగానికి కూడా ఉచిత కరెంట్ సరఫరా చేయాలన్నారు. గ్రో ఇన్‌చార్జెస్ ప్రభుత్వమే నిర్ణయించాలన్నారు. గతంలో సెంట్రల్ బోర్డు ద్వారా 50శాతం సబ్సిడీ ఇచ్చేవారని, ప్రస్తుతం అదే విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న మక్కలు ఫౌల్ట్రీ రంగానికి 28 శాతం సబ్సిడీకి ఇవ్వాలన్నారు. ఫౌల్ట్రీ ధరలను రైతులే నిర్ణయించేలా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం కామారెడ్డిలో 100 నామినేషన్లు వేయాలని నిర్ణయించామన్నారు.

You may also like

Leave a Comment