Telugu News » Telangana Elections: పీవీ నర్సింహారావు రికార్డును అధిగమించిన కాంగ్రెస్ అభ్యర్థి..!

Telangana Elections: పీవీ నర్సింహారావు రికార్డును అధిగమించిన కాంగ్రెస్ అభ్యర్థి..!

మంథని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధుపై 30వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

by Mano
Telangana Elections: PV Narsimha Rao is the Congress candidate who broke the record..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల(Telangana Assebmly Elections) ఫలితాలు ఎగ్జిట్ పోల్స్‌ను నిజం చేశాయి. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ(Congress Party) తెలంగాణలో పాగా వేసింది. ఈ నేపథ్యంలో గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థులు కొందరు పాత రికార్డులను చెరిపేసి సరికొత్త రికార్డును నెలకొల్పుతున్నారు.

Telangana Elections: PV Narsimha Rao is the Congress candidate who broke the record..!

మంథని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధుపై 30వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆయన ఇదే మంథని నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై చరిత్ర సృష్టించారు.

ఇదివరకు మంథని నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు రికార్డును శ్రీధర్ బాబు అధిగమించారు. మంథని నుంచి పీవీ నరసింహారావు 1957, 1962, 1967, 1972 ఎన్నికల్లో వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు 1999, 2004, 2009, 2018, 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొంది రికార్డును నెలకొల్పారు.

మంథని నియోజకవర్గంలో 2,36,442 మంది ఓటర్లు ఉండగా.. 1,95,632 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీధర్ బాబుకు 1,01,796 ఓట్లు వచ్చాయి. ఆయనకు పోటీగా నిలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధుకు 71,732 ఓట్లు వచ్చాయి. ఇక బీజేపీ అభ్యర్థి చందుపట్ల సునీల్ రెడ్డికి 5,642, బీఎస్పీ అభ్యర్థి నారాయణరెడ్డికి 2,878 ఓట్లు పోలయ్యాయి.

You may also like

Leave a Comment