ఇప్పటి వరకు ఆడవారు నీటి కుళాయిలా వద్దనో, లేక నిత్యావసర సరుకుల ధరల వద్దనో లొల్లిల్లు పెట్టుకోవడం చూశాం. ఇక సినిమా టికెట్ల కోసం కొట్టుకొన్న రోజులు సైతం పోయాయి.. కానీ మొట్ట మొదటి సారి కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం వల్ల, మహాలక్ష్మిలు అని పిలుచుకొంటున్న ఆడవారు.. బాక్సింగ్ రింగ్ లో బాక్సర్లు కొట్టుకొన్నట్టు, బస్సులో సీట్ల కోసం కొట్టుకోవడం కనిపిస్తోంది.
ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా వదలని సమాజంలో.. రోజంతా టికెట్ లేకుండా తిరిగే ఛాన్స్ ఇస్తే ఊరికే ఊరుకొంటారా?.. టైమ్ పాస్ కోసం ట్యాంక్ బండ్ కి, కూరగాయల కోసం మోండా మార్కెట్ కి, ముచ్చట్ల కోసం ముషీరాబాద్ కి.. ఇలా ఒకటేమిటి.. పల్లె, పట్నం అనే తేడా లేకుండా.. చేతిలో రూపాయి లేకుండా.. గుర్తింపు కార్డు పట్టుకొని తెగ తిరిగేస్తున్నారని అనుకొంటున్నారు..
ఇందులో భాగంగా బస్సు (BUS)లో ఫ్రీ జర్నీ (Free Journey) తెచ్చిన తంటతో సీటు కోసం చివరికి చెప్పులతో కొట్టుకునే వరకు వెళ్లారు మహిళామణులు.. సికింద్రాబాద్ (Secunderabad) నుంచి దుబ్బాక (Dubbaka) వస్తున్న బస్సులో సీటు కోసం మహిళల మధ్య గొడవ జరిగింది. ముందు మాటా మాటా పెరిగింది.. ఆతరువాత ఆ గొడవ కాస్త కాళ్ల చొప్పులు తీసుకొని కొట్టుకునే వరకు వెళ్ళింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకునే క్రమంలో.. చెప్పులు తీసుకుని కొట్టుకున్నారు.
మిగిలిన బస్సు ప్రయాణికులు ఈ ఘటనను తమ ఫోన్లలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సీన్ వైరల్గా మారింది. కాగా దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. సీట్ల కోసం ఇంత పోరు అవసరమా అని కొందరు. ఇది చూశారా సార్ అంటూ టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పై మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా ఈ ఘటన సిద్దిపేట (Siddipet) జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేటలో చోటుచేసుకొన్నట్టు సమాచారం..