Telugu News » KTR Telangana: రూ.700 కోట్లతో తెలంగాణాలో అగ్నిమాపక సామాగ్రీ తయారీ కేంద్రం

KTR Telangana: రూ.700 కోట్లతో తెలంగాణాలో అగ్నిమాపక సామాగ్రీ తయారీ కేంద్రం

అగ్నిమాపక సామాగ్రీ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ఈ పెట్టుబడులను ఉపయోగిస్తామని ఆ సంస్థ తెలిపింది.

by Prasanna

తెలంగాణాకు పెట్టుబడులు (Investments) వెలువెత్తు తున్నాయి. తెలంగాణ (Telangana) ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ (KTR) విదేశీ పర్యటనలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా పలురకాల సంస్థలు తెలంగాణాలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే రాష్ట్రంలో (State) రూ.700 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు యూఏఈకి చెందిన దిగ్గజ సంస్థ నాఫ్కో అంగీకరించింది. అగ్నిమాపక సామాగ్రీ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ఈ పెట్టుబడులను ఉపయోగిస్తామని ఆ సంస్థ తెలిపింది. ప్రస్తుతం దుబాయ్ ప్రర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశమవుతున్నారు.

తెలంగాణ త్వరితగతిన అభివృద్ధి చెందుతోందనీ ఇలాంటి సమయంలో అగ్నిమాపక సామాగ్రితోపాటు అగ్నిమాపక సేవలు అవసరం భవిషత్తులో ఎక్కువగా పెరుగుతుందని తాము నమ్ముతున్నట్లు నాఫ్కో సీఈఓ ఖాలిద్ అల్ ఖతిబ్ తెలిపారు. దాదాపు రూ.700 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న అగ్నిమాకప సామాగ్రి తయారీ కేంద్రం భారతదేశ అవసరాలకు సరిపోతుందని తెలిపారు.

ఈ సమావేశంలో భాగంగానే… రాష్ట్రానికి చెందిన నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్ తో కలిసి అంతర్జాతీయ స్థాయి ఫైర్ ట్రైనింగ్ అకాడమీని ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన నాఫ్కో…దాదాపు వందకు పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న తమ సంస్థ ఎఫీషియెన్సీని, అగ్నిమాపక శిక్షణను తెలంగాణా కేంద్రంగా అందించేందుకు త్వరలోనే అకాడమీ ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ సీఈఓ హామీ ఇచ్చారని కేటీఆర్ తెలిపారు.

You may also like

Leave a Comment