తెలంగాణ (Telangana) ఎన్నికలలో గెలిచి మూడో సారి అధికారం చేపట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ (BRS) పార్టీకి.. కాంగ్రెస్ కరెక్ట్ టైమ్ లో ఇచ్చిన ఎంట్రీ.. ఎదురుదెబ్బగా జనం భావిస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల కోడ్ అమలవుతుండటంతో ప్రభుత్వ పథకాలకు కాస్త విరామం దొరికింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు (Rythu Bandhu) రుణమాఫీ, ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ (DA) చెల్లింపు విషయమై ఇప్పటికే ఈసీకి ప్రతిపాదనలు పంపింది.
కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై వివరణలు కోరిన.. ఇంకా అనుమతి ఇవ్వలేదు. 2022 జులై ఒకటో తేదీ నుంచి మూడు డీఏలు ఇవ్వాల్సి ఉందని, ఒక డీఏ చెల్లింపునకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది. మరోవైపు రెండో పంట పెట్టుబడి, రైతుబంధు చెల్లింపు కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈసీని అనుమతి కోరింది.
రైతుబంధు చెల్లింపులు ఈ నెల 24 వ తేదీ నుంచి ప్రారంభించాలని భావిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం సీఈసీకి ఇచ్చిన లేఖలో పేర్కొన్నదని సమాచారం.. ఈ అంశానికి సంబంధించి కూడా సీఈసీ (CEC) కొన్ని వివరణలు కోరినట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఇంకా ఎలాంటి సమాధానం రాలేదని సమాచారం..