Telugu News » Hanmakonda : ఇక్కడ వయస్సు 44 ఏండ్లు.. కానీ అక్కడ మాత్రం 123 ఏండ్లు.. ?

Hanmakonda : ఇక్కడ వయస్సు 44 ఏండ్లు.. కానీ అక్కడ మాత్రం 123 ఏండ్లు.. ?

హన్మకొండ (Hanmakonda)జిల్లా కమలాపూర్ (Kamalapur) మండలానికి చెందిన కోడెపాక కోటిలింగం, కోడెపాక పద్మ అనే భార్య భర్తలు ఓటు హక్కుకోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికల సంఘం అధికారులు వీరికి ఓటర్ ఐడీ కార్డు కూడా మంజూరు చేశారు.

by Venu

తెలంగాణ (Telangana)లో ఇటీవల ఎన్నికల సంఘం (Election Commission)కొత్త ఓటర్ నమోదు ప్రక్రియ (New Voter Registration) చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ పక్రియలో జరిగే జిమ్మిక్కులు, వింతలు చూస్తే నవ్వాలో ఏడవాలో అర్ధం కానీ పరిస్థితి ఒక్కో సారి ఎదురవుతోంది. ఓటర్లు ఓటు హక్కును నమోదు చేసుకున్న సమయంలో అంతా సరిగ్గానే ఉంటుంది. కానీ ఆ తర్వాత చూస్తే పేర్లు, వయస్సు, చిరునామాలో మార్పు మొదలగు సమస్యలు కనిపిస్తాయి. ప్రస్తుతం కూడా ఇలాంటి వింతే జరిగింది.

హన్మకొండ (Hanmakonda)జిల్లా కమలాపూర్ (Kamalapur) మండలానికి చెందిన కోడెపాక కోటిలింగం, కోడెపాక పద్మ అనే భార్య భర్తలు ఓటు హక్కుకోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికల సంఘం అధికారులు వీరికి ఓటర్ ఐడీ కార్డు కూడా మంజూరు చేశారు. అయితే అందులో వీరి వయస్సు 44, 42కు బదులు ఏకంగా 123 సంవత్సరాలు వేయడం షాక్ కు గురిచేసింది.

మరోవైపు కోడెపాక కోటిలింగం వయస్సు 44 సంవత్సరాలు. కోడెపాక పద్మ వయస్సు 42 సంవత్సరాలు అని చెబుతోన్న ఈ భార్య భర్తల వయస్సును ఎన్నికల సంఘం అధికారులు 123 సంవత్సరాలుగా నిర్థారించారు. వీరిద్దరి పుట్టిన రోజును 1-1-1900 అని ఓటర్ ఐడీ కార్డులో వేశారు. తమ ఓటర్ ఐడీ కార్డులో పుట్టిన రోజును సరిచేసి సరైన వయస్సును వేయాలని బాధితులు కోరుతున్నారు.

You may also like

Leave a Comment