తెలంగాణ(Telangana)లో మాదకద్రవ్యాల నివారణ పోలీసులకు సవాల్‌గా మారింది. రాష్ట్రంలో ఈ దందా చాపకింద నీరులా నడిపిస్తున్నారు. సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తుల్లో కొందరు ఈ దందాని అత్యంత రహస్యంగా నడుపుతున్నారని ఇదివరకే కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయి. దీంతో అధికారులు సినీ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
తాజాగా నార్సింగి(Narsingi)లో ఇద్దరు నిందితులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న సంగతి తెలిసిందే. మొదటి నుంచి గోప్యంగా విచారణ జరుపుతున్న సైబరాబాద్ పోలీసులు(Cyberabad Police) మాదకద్రవ్యాల ముఠా గుట్టును లాగేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. పోలీసులకు పట్టుబడిన లావణ్య ఓ హీరో ప్రియురాలిగా పోలీసులు తేల్చారు.
ఆమెతో పాటు ఉనీత్‌రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. కాగా, రిమాండ్ రిపోర్టులో కీలక ఆధారంగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వరలక్ష్మి టిఫిన్స్ మత్తుపదార్థాల కేసులో అనుమానితురాలుగా ఉన్న లావణ్య విజయవాడ నుంచి ఉన్నత చదువులు హైదరాబాద్‌కు వచ్చింది. జల్సాలకు అలవాటు పడిపోయి టాలీవుడ్‌లో ఛాన్స్ కోసం లావణ్య ప్రయత్నించింది.
మ్యూజిక్ టీచర్‌గా పని చేస్తూ చిన్న సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది. కొన్ని షార్ట్ ఫిలింస్‌లో హీరోయిన్‌గా సైతం నటించింది. ఆ సమయంలోనే ఆమె జల్సాలకు అలవాటు పడింది. ప్రస్తుతం లావణ్య కోకాపేటలో ఓ విల్లాలో నివాసం ఉంటోంది. లావణ్య కొంత కాలంగా ఉనిత్ ద్వారా మత్తు పదార్థాలను తెప్పించుకుంటున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
చిత్ర పరిశ్రమలో పలువురికి మాదకద్రవ్యాలను చేసినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లావణ్య సోషల్ మీడియా అకౌంట్‌లతో పాటు వ్యక్తిగత చాట్‌ని సైతం పోలీసులు పరిశీలించనున్నారు. చాలామంది వీఐపీలతో పరిచయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అదేవిధంగా ఈ కేసుపై నార్కొటిక్ బ్యూరో అధికారులు సైతం ఆరా తీస్తున్నారు.