తెలంగాణ (Telangana)లో ఇంటర్మీడియట్ పరీక్షల (Intermediate Exams) షెడ్యూల్ (Schedule)ను రాష్ట్ర ఇంటర్మీడియెట్ బోర్డు ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం అవుతాయని బోర్డు వెల్లడించింది. మార్చి 19 వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొంది.
ఇక ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహిస్తామని తెలిపింది. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 28న మొదలై మార్చి 18 వరకు ముగియనున్నాయి. ఇంటర్మీడియల్ రెండవ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 29 నుంచి మార్చి 19 నిర్వహించనున్నట్టు బోర్డు ప్రకటనలో వెల్లడించింది.
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్టు పేర్కొంది. ఇంటర్ ప్రాక్టికల్స్ ను ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించింది. మొత్తం రెండు సెషన్స్ లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. మొదటి సెషన్ ఉదయం సెషన్ 9 నుంచి 12 గంటల వరకు ఉంటుందని తెలిపింది.
ఇక రెండవ సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని చెప్పింది. మొదటి సంవత్సరం ( 2023-24లో జాయిన్ అయిన) విద్యార్థులకు మాత్రమే ఫిబ్రవరి 16 న మాత్రమే ఇంగ్లీష్ మొదటి సంవత్సరం ఫైనల్ ప్రాక్టికల్ నిర్వహిస్తారు. ఇక ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్ పరీక్షను (2023-24 విద్యా సంవత్సరానికి ముందు ప్రవేశించిన) పాత విద్యార్థులకు, బ్యాక్ లాగ్ ఉన్న విద్యార్థులకు ఫిబ్రవరి 17న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నారు.