Telugu News » Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు.. కలిసిపోయిన కాంగ్రెస్‌-టీజేఎస్..!

Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు.. కలిసిపోయిన కాంగ్రెస్‌-టీజేఎస్..!

ఈ భేటీ అనంతరం టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణకు పట్టిన చీడ, పీడ వదలాలంటే కోదండరాం మద్దతు అవసరమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ జన సమితి, కాంగ్రెస్ కలిసి పనిచేస్తాయని చెప్పారు.

by Mano
Telangana Politics: Key turning point in Telangana politics.. Congress-TJS merged..!

తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. తెలంగాణ జనసమితి(TJS) , కాంగ్రెస్ పార్టీ(Congress Party) భేటీ అనంతరం ఆయా పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాయి. బీఆర్ఎస్ పార్టీని గద్దె నుంచి దించడమే ఉమ్మడి లక్ష్యంగా ఈ ఎన్నికల్లో రెండు పార్టీలూ పరస్పరం సహకరించుకునేలా చర్చలు సఫలమయ్యాయి.

Telangana Politics: Key turning point in Telangana politics.. Congress-TJS merged..!

ఈ భేటీ అనంతరం టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణకు పట్టిన చీడ, పీడ వదలాలంటే కోదండరాం మద్దతు అవసరమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ జన సమితి, కాంగ్రెస్ కలిసి పనిచేస్తాయని చెప్పారు. కాంగ్రెస్‌తో కలిసి పని చేయడానికి కోదండరాం సుముఖత చూపారని తెలిపారు. కోదండరాం మద్దతు కోరామన్నారు. ఎన్నికల్లో తెలంగాణ జన సమితి పోటీకి దూరంగా ఉంటుందని రేవంత్‌రెడ్డి వివరించారు.

కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణకు విముక్తి కల్పించాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి ముందుకెళ్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ జన సమితిని ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కోదండరాం పోరాడుతున్నారని రేవంత్ చెప్పారు. ఓట్లు, సీట్ల సర్దుబాటుకు బదులుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిపాలనలో టీజేఎస్‌కు తగిన భాగస్వామ్యం కల్పిస్తామని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి స్పష్టత ఇచ్చారు.

ఈ సందర్భంగా కోదండ రాం మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై రేవంత్ క్లారిటీ ఇవ్వగా, వాటికి అదనంగా ఆరు అంశాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా తొమ్మిదేండ్ల పాలన నిరంకుశంగా, అప్రజాస్వామికంగా కొనసాగుతున్నదని, అనేక సెక్షన్ల ప్రజలు అవస్థలు పడుతున్నారని, ప్రజా పరిపాలన కోసమే కాంగ్రెస్‌తో కలిసి పనిచేయాని నిర్ణయించుకున్నామని తెలిపారు. కొత్త ప్రభుత్వంలో పరిపాలనలో తగిన భాగస్వామ్యం కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీతో అవగాహన కుదిరిందన్నారు.

విద్య, వైద్యాన్ని ప్రజలకు ఉచితంగా అందించాలని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, రైతాంగానికి తగిన సహాయ సహకారాలు లభించాలని, పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు భాగస్వామ్యాన్ని ఇవ్వాలని, తెలంగాణ పునర్ నిర్మాణం కోసం టీజేఎస్, కాంగ్రెస్ మధ్య సమన్వయ కమిటీ ఏర్పాటు కావాలని కోదండరాం సూచించారు. ఈ మేరకు బీఆర్ఎస్ నిరంకుశ పాలనను అంతమొందించే గొప్ప లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీకి కోదండరాం సంపూర్ణ సహకారం అందిస్తున్నారని, ఇది ఆహ్వానించదగిన పరిణామం అని రేవంత్ అన్నారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల కోసం కొట్లాడిన కోదండరాం విజ్ఞప్తికి అనుగుణంగా 40 లక్షల మంది యువత, నిరుద్యోగులు బీఆర్ఎస్ పాలనను గద్దె దించడానికి కదిలి రావాలని పిలుపునిచ్చారు.

You may also like

Leave a Comment