Telugu News » Cable Tv Owners : తెలంగాణ రాష్ట్ర కేబుల్ టీవీ యాజమాన్యాల కోర్ కమిటీ ఎన్నిక…!

Cable Tv Owners : తెలంగాణ రాష్ట్ర కేబుల్ టీవీ యాజమాన్యాల కోర్ కమిటీ ఎన్నిక…!

ఎన్-24 న్యూస్ టీవి (N-24 News Tv) , మీడియా టుడే టీవీ అధినేత కే.కోటేశ్వర్ రావు (KKR)అధ్యక్షతన సభను నిర్వహించారు.

by Ramu

తెలంగాణ రాష్ట్ర కేబుల్ టీవీ యాజమాన్యాల ఆత్మీయ సమ్మేళనం, నూతనంగా ఎన్నికైన ప్రజా ప్రభుత్వానికి అభినందన, కృతజ్ఞత సభ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో జరిగింది. ఎన్-24 న్యూస్ టీవి (N-24 News Tv) , మీడియా టుడే టీవీ అధినేత కే.కోటేశ్వర్ రావు (KKR)అధ్యక్షతన సభను నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా న్యూస్ 9 టుడే అధినేత సీచ్.వీ.చలపతి రాజు, ఏడబ్యూజేఏ, ఎక్స్ క్లూజివ్ టీవీ అధినేత అనం చిన్ని వెంకటేశ్వరావు హాజరయ్యారు.


ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర కేబుల్ టీవీ యాజమాన్యాల కోర్ కమిటీని ఎన్నికున్నారు. ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ…. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను ప్రతి కేబుల్ టీవీ తీసుకుంటుందని తెలిపారు. నూతన ప్రజాస్వామిక ప్రభుత్వానికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని వెల్లడించారు. ప్రభుత్వంతో చర్చించి ప్రభుత్వ ప్రకటనలు కేబుల్ టీవీ యాజమాన్యాలకు అందే విధంగా చూడాలని కోర్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకునేందుకు సభ నిర్ణయించింది.

తెలంగాణలోని అన్ని ప్రెస్ క్లబ్‌లల్లో జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడే వారికి మాత్రమే అవకాశం కల్పించాలని సూచించారు. కానీ చాలా ప్రాంతాల్లో అలా జరగడం లేదన్నారు. కొన్ని ప్రెస్ క్లబ్‌లల్లో మద్యంతో విచ్చలవిడిగా జల్సాలు చేస్తూ జర్నలిస్టు వృత్తికి అవమానం కలిగించేలా ప్రవర్తిస్తున్నారని అన్నారు. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నామని చెప్పారు.

త్వరలో సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి చేపట్టే ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని చెప్పారు. ప్రెస్ క్లబ్ అనేది కేవలం జర్నలిస్టుల సంక్షేమానికి, జర్నలిస్టులకు కోసమే పని చేయాలని కోరారు. వారి మనోభావాలు దెబ్బ తినకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే ఈ విషయాలపై తెలంగాణ జర్నలిస్టుల సమాజాన్ని ఏక తాటిపైకి తీసుకువస్తామన్నారు.

ఇది ఇలా వుంటే కోర్ కమిటీ సభ్యులుగా కే.కోటేశ్వర్ రావు, హెచ్.వీ.చలపతి రాజు, అనం చిన్ని వెంకటేశ్వరావు, ఎం. రవి కుమార్, కృష్ణంరాజు, జితేందర్, దేవేందర్, రవీందర్, సాజితా సికిందర్, సీహెచ్. శ్రీనివాస్ రావు, బ్రహ్మం, గిరి, రవికుమార్ లను ఎన్నుకున్నారు.

You may also like

Leave a Comment