Telugu News » Kaleswaram : బీఆర్ఎస్ నిజస్వరూపం బయట పెట్టిన రేవంత్ రెడ్డి..!?

Kaleswaram : బీఆర్ఎస్ నిజస్వరూపం బయట పెట్టిన రేవంత్ రెడ్డి..!?

నాణ్యతా లోపం వల్లే మేడిగడ్డ బ్యారేజీ వంతెన కుంగిందని ఆరోపించిన రేవంత్.. కాళేశ్వరం అసలు డొల్లతనం, నిజస్వరూపం ఇప్పుడు బయటపడిందన్నారు. కేసీఆర్‌ ధన దాహం వల్ల రాష్ట్రం అప్పుల పాలైందని దుయ్యబట్టారు.

by Venu
Revanth reddy fire on kcr family

తెలంగాణ (Telangana) సీఎం కేసీఆర్‌ (KCR) కాళేశ్వరం (Kaleswaram) గురించి చాలా గొప్పగా చెబుతున్నారని కానీ ఆయన చెప్పినంత విషయం ఆ ప్రాజెక్ట్ లో ఏమి లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) విమర్శించారు. కేసీఆర్ కుటుంబం ధనదాహానికి కాళేశ్వరం ప్రాజెక్టు (Project) బలైపోయిందని ఆరోపించారు.. కాళేశ్వరం పేరు చెప్పుకొని రూ.లక్ష కోట్లు అవినీతికి పాల్పడ్డ కేసీఆర్‌ చిలక పలుకులు పలకడం విడ్డూరమని రేవంత్ ఎద్దేవా చేశారు.

revanth-reddy

 

కాళేశ్వరం అవినీతికి సంబంధించిన విషయాన్ని ఎన్నో సార్లు రాహుల్ గాంధీ చెప్పారని.. పలుసార్లు తాను కూడ ఈ అంశం పై మాట్లాడినట్టు రేవంత్ వెల్లడించారు. వీళ్ళ అవినీతి భాగోతం బయట పడాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నాణ్యతా లోపం వల్లే మేడిగడ్డ బ్యారేజీ వంతెన కుంగిందని ఆరోపించిన రేవంత్.. కాళేశ్వరం అసలు డొల్లతనం, నిజస్వరూపం ఇప్పుడు బయటపడిందన్నారు. కేసీఆర్‌ ధన దాహం వల్ల రాష్ట్రం అప్పుల పాలైందని దుయ్యబట్టారు.

 

ఇన్నాళ్లుగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచానికే అద్భుతమని బీఆర్ఎస్ చెప్తూ జనాన్ని మోసం చేస్తుందని రేవంత్ అన్నారు. కేసీఆర్ గొప్ప ఇంజినీరుగా చెప్పుకుని రూ.లక్ష కోట్ల ప్రజా ధనం వృథా చేశారని, ఇప్పటికైనా కాళేశ్వరం పై విచారణ జరిపించాలని రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమండ్ చేసారు.. లేదంటే అధికారంలోకి రాగానే కాళేశ్వరం అవినీతిని కాంగ్రెస్ పార్టీ బయట పెడుతుందని రేవంత్ హెచ్చరించారు.

మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు‌‌‌‌‌‌‌‌లో కీలకమైన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ 6వ బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 15 నుంచి 20 మధ్య ఉన్న పిల్లర్లలో కొన్ని కుంగినట్లు తెలుస్తోంది. దీంతో ప్రాజెక్టు బ్రిడ్జి షేప్‌‌‌‌‌‌‌‌ మారినట్టు కనిపిస్తోంది. మెయింటెనెన్స్ వర్క్ చేస్తున్న సిబ్బంది.. గేట్ల నుంచి శబ్దాలు రావడంతో అలర్ట్ అయ్యారు. కాగా పిల్లర్లు కుంగినట్టు గుర్తించి వెంటనే మహారాష్ట్ర, తెలంగాణ మధ్య రాకపోకలు బంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. దీంతో రెండువైపులా పెద్దసంఖ్యలో వాహనాలు బారులుతీరాయి

You may also like

Leave a Comment