Telugu News » Telangana Weather: చలిపులి పంజా.. గజగజ వణుకుతున్న ప్రజలు..!

Telangana Weather: చలిపులి పంజా.. గజగజ వణుకుతున్న ప్రజలు..!

, మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని హైదరాబాద్(Hyderabad) వాతావరణ కేంద్రం తెలిపింది. డిసెంబర్ నెలాఖరుకు మళ్లీ చలి తీవ్రత పెరిగి చలికి తోడు చలి గాలులు వీస్తాయి.

by Mano
Telangana Weather: Cold tiger claw.. people shivering..!

తెలంగాణ(Telangana)పై చలిపులి పంజా విసురుతోంది. కొద్ది రోజులుగా చలి తీవ్రత పెరుగుతూ వస్తోంది. బుధవారం చలితీవ్రత ఒక్కసారిగా పెరిగిపోవడంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. మరో రెండు, మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని హైదరాబాద్(Hyderabad) వాతావరణ కేంద్రం తెలిపింది. డిసెంబర్ నెలాఖరుకు మళ్లీ చలి తీవ్రత పెరిగి చలికి తోడు చలి గాలులు వీస్తాయి.

Telangana Weather: Cold tiger claw.. people shivering..!

రాత్రిపూట ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని, సాధారణం కంటే ఒక డిగ్రీ తక్కువగా నమోదవుతుందని పేర్కొంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో 12 నుంచి 13 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. మూడు రోజుల తర్వాత సాధారణ స్థితికి వస్తుందని అధికారులు వెల్లడించారు. ఉష్ణోగ్రతలు పడిపోతున్న నేపథ్యంలో చిన్నపిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

తెలంగాణలోని మెదక్ జిల్లాలో అత్యల్పంగా 12.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెంలో అత్యధికంగా 18 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.రాష్ట్రవ్యాప్తంగా సగటు పగటి ఉష్ణోగ్రత 28 నుంచి 31 డిగ్రీల మధ్య నమోదవుతోంది. హైదరాబాద్ శివారులో అత్యల్పంగా 28 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదు కాగా, ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 31° నమోదైంది.

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో 12.5డిగ్రీల సెల్సియస్, మెదక్ 12.8, పటాన్‌చెరులో 13.2, ఆదిలాబాద్‌లో 13.7, హకీంపేటలో 14.5, హనుమకొండలో 15, దుండిగల్లో 15.7, రామగుండంలో 14.6, నిజామాబాద్‌లో 7.61, హైదరాబాద్‌లో 16.56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మం 17, మహబూబ్ నగర్ 18.5, భద్రాచలంలో 18 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.

You may also like

Leave a Comment