Telugu News » Weather : వర్షాకాలంలో ఎండలు.. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక

Weather : వర్షాకాలంలో ఎండలు.. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక

కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన ఉక్కపోత, వేడి ఉంటోంది. కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రత ఎక్కువగా కనిపిస్తోంది. అక్కడక్కడా ఆకాశం మేఘావృతమై కన్పించినా వర్షాల జాడ తక్కువే.

by admin
telugu-states-weather-update

సాధారణంగా అక్టోబర్ (October) నెల అనగానే వర్షాలు పడడం కామన్. రుతుపవనాల ఎఫెక్టో, అల్పపీడన ప్రభవం వల్లో వానలు పడుతుంటాయి. కానీ, తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మంట పుట్టిస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతల (Temperature) తో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అసలు ఇది వర్షాకాలమా? లేక, ఎండాకాలమా? అనే డౌట్ కూడా వ్యక్తం అవుతోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడం, ఉక్కపోతతో జనాలు ఇబ్బంది పడుతున్నారు.

telugu-states-weather-update

కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన ఉక్కపోత, వేడి ఉంటోంది. కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రత ఎక్కువగా కనిపిస్తోంది. అక్కడక్కడా ఆకాశం మేఘావృతమై కన్పించినా వర్షాల జాడ తక్కువే. దీనికి కారణం నైరుతి రుతుపవనాలు (Monsoon) వెనక్కి తరలిపోతుండటమేనని వాతావరణ శాఖ తాజాగా వెల్లడించింది. గాలుల వేగం చాలా తక్కువగా ఉండటంతో మేఘాల కదలిక కూడా పెద్దగా ఉండదు. కాబట్టి, వర్షాలు దాదాపుగా ముగిసిపోయినట్టేననే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

తెలంగాణ (Telangana) లో ఎండ తీవ్రత అధికంగా ఉంది. హైదరాబాద్‌ (Hyderabad) లో అయితే.. శనివారం గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీలు నమోదయ్యే అవకాశముందని అంచనా వేసింది వాతావరణ శాఖ. ఉపరితల గాలులు ఉత్తర దశ నుంచి వీచే అవకాశముందని తెలిపింది. రాష్ట్రంలో మరో 10 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరించింది. కొన్ని రోజుల పాటు ఎండ వేడి తీవ్రంగా ఉంటుందని ప్రజలకు అలర్ట్ జారీ చేసింది.

ఏపీ (Andhra Pradesh) లో అయితే.. విభిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. కొన్నిచోట్ల వానలు (Rains) పడుతున్నాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురుస్తాయని.. మిగిలిన ప్రాంతాల్లో ఎండ తీవ్రత పెరుగుతుందని వాతావరణశాఖ అంచనా వేసింది. మళ్లీ తుపాన్లు వస్తే తప్ప వాతావరణం చల్లబడే సూచనలు కనిపించడం లేదని అంటున్నారు అధికారులు.

You may also like

Leave a Comment