తాను చెప్పిన రోజు విమానంలో ప్రయాణించొద్దని ఓ తీవ్రవాది(Terrorist) హెచ్చరిక కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్(Viral Video) అవుతోంది. ప్రపంచ క్రికెట్, ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంలను ప్రస్తావిస్తూ ఆ తీవ్రవాది ఆరోజు ఆ విమానంలో ప్రయాణించవద్దంటూ ప్రత్యేకంగా సిక్కులను ఉద్దేశిస్తూ సూచించాడు. ఈ వీడియో ప్రస్తుతం విమానాల్లో వెళ్లే వారికి టెన్షన్ పెడుతోంది.
ఈ నెల 19న ఎయిర్ ఇండియా(Air India) విమానాల్లో సిక్కులు ప్రయాణించొద్దని ఖలిస్థాన్ తీవ్రవాది గురు పత్వంత్ సింగ్(Guru Patvanth Singh) హెచ్చరించారు. ‘నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించొద్దని మేము సిక్కులను కోరుతున్నాం. ఆ రోజు ప్రపంచ దిగ్బంధం ఉంటుంది. మీ ప్రాణాలకు ప్రమాదం’ అని గుర్‌పత్వంత్ ఒక వీడియోలో హెచ్చరించారు.
వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నవంబర్ 19న ఢిల్లీ విమానాశ్రయాన్ని మూసేయనున్నట్లు, దాని పేరును మార్చనున్నట్లు గురు పత్వంత్ చెప్పారు. అదే రోజు క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ జరుగుతుండటాన్ని గుర్తుచేశారు. ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం నుంచి మోదీ పాఠాలు నేర్చుకోకపోతే అలాంటి ప్రతిస్పందనే భారత్‌లో ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పాడు. గతనెల 10న గురు పత్వంత్ ప్రధాని మోదీకి హెచ్చరికలు చేశారు.
అక్టోబర్ 31, 1984న నాటి ప్రధాని ఇందిరా గాంధీని న్యూఢిల్లీలోని అధికారిక నివాసంలో ఆమె బాడీగార్డ్స్ బియాంత్ సింగ్, సత్వంత్ సింగ్‌లు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఖలిస్తాన్ ప్రజాభిప్రాయ సేకరణతో పంజాబ్ స్వాతంత్య్ర పోరాటం ఇప్పటికే ప్రారంభమైందని గురుపత్వంత్ సింగ్ పన్నూ చెప్పాడు. భారత ట్యాంకులు, ఫిరంగిదళాలు దాని సాకారాన్ని నిరోధించలేవని ఆయన స్పష్టం చేశారు. కాగా.. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యల తర్వాత భారత్‌కు, ప్రధాని నరేంద్ర మోడీకి పన్నూ హెచ్చరికలు పంపుతుండటం ఆందోళన కలిగించే విషయం.