తమిళ స్టార్ హీరో(Tamil Star Hero) దళపతి విజయ్(Thalapathy Vijay)పై కేసు నమోదైంది. ఎన్నికల కోసం రష్యాలో షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన విజయ్ తాజాగా చెన్నై వచ్చాడు. ఈ క్రమంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించాడని ఓ సామాజిక కార్యకర్త విజయ్‌పై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. విజయ్ వల్ల తమకు తీవ్ర ఇబ్బంది కలిగిందని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు.
విజయ్ తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి కారులో బయల్దేరిన విజయ్ నీలాంగరై పోలింగ్ బూత్‌కు చేరుకున్నాడు. విజయ్ పోలింగ్ కేంద్రానికి రాగానే అభిమానులు ఆయను చూసేందుకు ఎగబడ్డారు. విజయ్‌తో పాటు ఆయన అనుచరులు, మద్దతుదారులు 200 మందికి పైగా ఒకేసారి పోలింగ్ బూత్‌కు వచ్చారు.
దీంతో అక్కడ సాధారణ ఓటర్లు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ విషయమై సెల్వం అనే సామాజిక కార్యకర్త చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి 200 మందితో పోలింగ్ కేంద్రంలోకి విజయ్ వెళ్లారని, క్యూలో నిలబడకుండా ఆయన నేరుగా వెళ్లి ఓటు వేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉండగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల హడావుడి నడుస్తోంది. ఏప్రిల్ 19న పలు రాష్ట్రాల్లో తొలి విడత పోలింగ్ జరిగింది. ఇందులో తమిళనాడు కూడా ఉంది. ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ చెన్నై వచ్చారు. కొన్ని నెలల క్రితం ‘తమిళ వెట్రి కళగం’ పేరుతో విజయ్ రాజకీయ పార్టీ పెట్టిన విషయం తెలిసిందే.