Telugu News » BJP : బీజేపీ తీసుకున్న ఆ రాంగ్ టర్న్.. పార్టీకి మైనస్ అయిందా..?

BJP : బీజేపీ తీసుకున్న ఆ రాంగ్ టర్న్.. పార్టీకి మైనస్ అయిందా..?

కమలం పార్టీలో త్రిబుల్ ఆర్ (RRR) అని పిలవబడుతున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలైన రాజాసింగ్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్​లలో.. రాజాసింగ్ గెలవగా, రఘునందన్ రావు, ఈటల రాజేందర్ అపజయాన్ని మూటగట్టుకున్నారు. రెండు స్థానాల్లో పోటీ చేసిన ఈటల రాజేందర్ సొంత నియోజకవర్గమైన హుజూరాబాద్​లో కూడా ఓటమి చెందటం మింగుడుపడని విషయం..

by Venu

– నెరవేరని బీజేపీ లక్ష్యం
– కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిన ఓటర్
– హంగ్ అంటూ హడావుడి
– 8 సీట్లతోనే సరి
– పెరిగిన ఓట్ షేర్ తో కాస్త ఊరట

రాజకీయం ఓ చదరంగం ఆటలాడింది. చదరంగంలో ఎత్తులు సరిగ్గా వేయకుంటే ఒడిపోతారు. రాజకీయంలో కూడా సరైన సమయంలో ఎత్తులు వేయకున్నా అంతే. ఇదే నిజం బీజేపీని చూస్తే అర్థం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించాయి. బీజేపీ కూడా తగ్గేదేలేదన్నట్టు చేసింది.

bjp

ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత ప్రధాని ఏకంగా 5 సార్లు రాష్ట్రానికి వచ్చి 8 బహిరంగ సభలు, ఒక రోడ్ షోలో పాల్గొన్నారు. కానీ, బీజేపీ ముఖ్య నేతలు మాత్రం ప్రభావం చూపించ లేకపోయారు. అదీగాక, వలసలను నిలువరించలేకపోవడం, చేరికలు లేకపోవడం, అధ్యక్ష మార్పు ఇలా అనేక కారణాలతో కమలం పార్టీ ఇమేజ్ అంతా డ్యామేజ్ అయిపోయింది.

ఆఖరికి ట్రిబుల్ ఆర్ అని పిలవబడుతున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలైన రాజాసింగ్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్ లలో.. రాజాసింగ్ ఒక్కరే గెలిచారు. రఘునందన్, ఈటల అపజయాన్ని మూటగట్టుకున్నారు. రెండు స్థానాల్లో పోటీ చేసిన ఈటల రాజేందర్ సొంత నియోజకవర్గమైన హుజూరాబాద్ లో ఓటమి చవిచూశారు. ఈటల ఓవర్ కాన్ఫిడెన్స్, ఒంటెద్దు పోకడలు ఓటమికి కారణాలుగా చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు, ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్న ఎంపీలు బండి సంజయ్, అరవింద్, సోయం బాపురావు కూడా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయారు.

కిషన్ రెడ్డి సొంత నియోజకర్గమైన అంబర్ పేటలో కూడా ఆ పార్టీ అభ్యర్థి కృష్ణ యాదవ్ మూడో స్థానానికి పరిమితమయ్యారు. బీజేపీ, ఆశించిన స్థానాలు దక్కకపోయినా ఓట్ షేర్ మాత్రం సాధించింది. కానీ, పార్టీ ముఖ్యనేతలు వెనుక పడటం మాత్రం మింగుడుపడని అంశంగా మారింది. బండి సంజయ్ ని బీజేపీ అధిష్టానం రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించి రాంగ్ టర్న్ తీసుకుందని.. లేకుంటే మరికొన్ని స్థానాల్లో విజయం సాధించేదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

You may also like

Leave a Comment