రాష్ట్రంలో పలు సంచనాలకు తెరలేపిన ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో మరోకొత్త కోణం వెలుగుచూసింది. ఇప్పటికే ఈ కేసులో పలువురు అధికారులు అరెస్టు అయ్యారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థను గత ప్రభుత్వం తమ స్వార్థానికి వాడుకున్నదని పలువురు రాజకీయ విశ్లేషకులు, లీడర్లు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఎస్ఐబీ (SIB) సస్పెంసెడ్ డీఎస్పీ ప్రణీత్ రావు(Praneeth rao) ఆధ్వర్యంలో కేవలం సినిమా, రాజకీయ, వ్యాపార, వాణిజ్య, రియల్ ఎస్టేట్ వ్యక్తులకు సంభించిన ఫోన్లు మాత్రమే కాకుండా లాయర్లు, జడ్జీల ఫోన్లూ సైతం ట్యాపింగ్‌కు గురయ్యాయని అడ్వొకేట్ అరుణ్ కుమార్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ మేరకు సోమవారం అరుణ్ కుమార్ (Lawyor Arun kumar) హైకోర్టులో పిటిషన్ వేసినట్లు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో
జడ్జీల ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగాయని ఆయన వాదిస్తున్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని తన పిటిషన్లో పేర్కొనట్లు సమాచారం. ఇదే వ్యవహారంలో కీలక పాత్రధారిగా ఉన్న ప్రణీత్ రావ్ ఫోన్ ట్యాపింగ్ పై కూడా పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అడ్వొకేట్ అరుణ్ కుమార్ కోర్టుకు విన్నవించారు.
కానీ, దానిపై ఇంకా స్పందన రాలేదు. ఏకంగా న్యాయమూర్తుల ఫోన్లను ట్యాపింగ్ చేసిన కేసులో వీరికి ఆదేశాలు ఇచ్చిన రాజకీయ నాయకులపై పోలీసు లు త్వరగా చర్యలు తీసుకోవాలి లాయర్ అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఒకవేళ ఈ కేసును త్వరగా విచారణ జరిపి నిందితులకు శిక్ష విధించకపోతే వారు తప్పించుకునే అవకాశం ఉందని అడ్వకేట్ అరుణ్ కుమార్ హైకోర్టులో వాదనలు వినిపించట్లు సమాచారం.