Telugu News » Israel-Hamas War : ఆగని యుద్ధం…..గాజాలో దయనీయంగా మహిళలు, పిల్లల పరిస్థితి….!

Israel-Hamas War : ఆగని యుద్ధం…..గాజాలో దయనీయంగా మహిళలు, పిల్లల పరిస్థితి….!

అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఇప్పటి వరకు 23 వేల మంది పాలస్తీనీయులు మరణించినట్టు ఐరాస వెల్లడించింది.

by Ramu

ఇజ్రాయెల్ (Israel-Hamas) గాజా మధ్య యుద్దం కొనసాగుతోంది. యుద్ధం (War) తాలూకు విధ్వంసంతో గాజా చితికి పోతోంది. అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఇప్పటి వరకు 23 వేల మంది పాలస్తీనీయులు మరణించినట్టు ఐరాస వెల్లడించింది. అందులో 16వేల మంది మహిళలు ఉన్నట్టు పాలస్తీనా ఆరోగ్య శాఖ ప్రకటించినట్టు ఐరాస పేర్కొంది.

ఈ యుద్ధంలో మహిళలు, పిల్లలు ప్రధాన బాధితులుగా ఉన్నారని యూఎన్ మహిళా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిమా బహౌస్ వెల్లడించారు. తాజాగా ఐరాస విడుదల చేసిన నివేదిక ప్రకారం….. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసిన తర్వాత ప్రతి గంటకు ఇద్దరు తల్లులు మరణిస్తున్నారు. యుద్దం వల్ల ఇప్పటి వరకు 1,9 మిలియన్ మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.

వారిలో మిలియన్ వరకు మహిళలు, బాలికలు ఉన్నారు. గాజా, వెస్ట్ బ్యాంక్‌లో మరణించిన పౌరులందరిలో 67 శాతం మంది పురుషులు ఉండగా14 శాతం కంటే తక్కువ మంది మహిళలు ఉన్నారు. సుమారు 3,000 మంది స్త్రీలు వితంతువులు అయ్యారని, దీంతో కుటుంబ భారం వారిపై పడింది. సుమారు 10వేల మంది పిల్లలు తండ్రి లేనివారిగా మారారని అంచనా వేసింది.

ఇది ఇలా వుంటే మానవతావాద దృక్పథంతో కాల్పుల విరమణ చేపట్టాలని అగ్రరాజ్యం అమెరికా కోరింది. ప్రస్తుతం గాజాలో మహిళలు, చిన్నారుల పరిస్థితి దారుణంగా దిగజారి పోయిందని అంటానియో గుటెరెస్ అన్నారు. గాజాలో ఉన్న వారి కోసం భద్రత, వైద్య సంరక్షణ, ఆరోగ్య సంరక్షణ, ఆశ్రయం కల్పించాలని గుటెర్సెస్ కోరారు.

You may also like

Leave a Comment