Telugu News » ఈ ప్రిన్సిపాల్‌ మాకొద్దు..విద్యార్థినులు రోడ్డు మీద బైఠాయింపు!

ఈ ప్రిన్సిపాల్‌ మాకొద్దు..విద్యార్థినులు రోడ్డు మీద బైఠాయింపు!

ఉదయం నుంచి వారు కనీసం మంచినీళ్లు కూడా తాగకుండా, ఎండలోనే సుమారు మూడు గంటల పాటు ఉండిపోయారు.

by Sai
the students were concerned that the principal was tourturing them

ఈ ప్రిన్సిపాల్‌ మాకొద్దంటూ విద్యార్థినులు రోడెక్కారు. బుధవారం ఉదయం కొమురం భీం అసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలోని ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ గర్ల్స్‌ హాస్టల్ విద్యార్థినులు ఎనిమిది గంటల సమయంలో ఒక్కసారిగా మార్కెట్ ఏరియాలోని వీధుల గుండా పరుగులు పెట్టారు.

the students were concerned that the principal was tourturing them

దీంతో స్థానిక పట్టణవాసులు హాస్టల్లో ఏమి జరిగిందంటూ హడలిపోయారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ చౌరస్తా వద్దకు చేరుకున్న విద్యార్థినులు రోడ్డు పై సుమారు గంట సేపు కూర్చుని నినాదాలు చేశారు.

దీంతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి.సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని విద్యార్థులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. మమ్మల్ని టార్చర్‌ పెడుతున్నప్రిన్సిపాల్‌ పై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థినులు భీష్మించుకు కూర్చున్నారు.

అనంతరం జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయానికి చేరుకున్న విద్యార్థినులు అక్కడ కూడా ఆందోళన చేపట్టారు. ఉదయం నుంచి వారు కనీసం మంచినీళ్లు కూడా తాగకుండా, ఎండలోనే సుమారు మూడు గంటల పాటు ఉండిపోయారు.

కలెక్టర్‌ వచ్చి న్యాయం చేసేదాకా ఇక్కడ నుంచి కదిలేది లేదని..ప్రిన్సిపాల్‌ ను సస్పెండ్‌ చేయాలంటూ విద్యార్థులు పట్టుబట్టారు. హాస్టల్‌ ప్రిన్సిపల్‌ జ్యోతిలక్ష్మీ ప్రతిరోజు మమ్మల్ని అందరినీ ఇబ్బందులకు గురి చేస్తుందని..భోజనం మెను ప్రకారం పెట్టడం లేదన్నారు.

విద్యార్థులు అనారోగ్యంతో బాధపడిన పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఇంటికైనా పంపించడం రిక్వెస్ట్‌ చేసిన..అవసరం లేదంటూ మమ్మల్ని ఏడిపిస్తుందని విద్యార్థులు వారి బాధను చెప్పుకొచ్చారు.

వారంలో శుక్రవారం నుంచి మంగళవారం దాకా ప్రిన్సిపాల్ హాస్టల్‌ కు రావడం లేదని ఆరోపించారు. ప్రిన్సిపాల్‌ పలు రకాలుగా మమ్మల్ని టార్చర్‌ చేస్తున్నారని..ఎట్టి పరిస్థితుల్లో ప్రిన్సిపాల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

You may also like

Leave a Comment