Telugu News » Traffic Police : వాహన దారులకి షాకిచ్చిన ట్రాఫిక్ పోలీసులు.. చలాన్లపై రాయితీకి లిమిట్..!!

Traffic Police : వాహన దారులకి షాకిచ్చిన ట్రాఫిక్ పోలీసులు.. చలాన్లపై రాయితీకి లిమిట్..!!

కోవిడ్ కారణంగా వెహికల్స్ ఓనర్స్ పెండింగ్ చలాన్లు చెల్లించపోయారు. కొన్ని వెహికల్స్ పై వాటి వ్యాల్యూ కంటే ఎక్కువ మొత్తం లో చలాన్లు ఉన్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ పరిధిలోని మూడు కమిషనరేట్లతో పాటు తెలంగాణ వ్యాప్తంగా వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లపై రాయితీని ప్రభుత్వం ప్రకటించింది.

by Venu

తెలంగాణ (Telangana) ప్రజలకి ట్రాఫిక్ పోలీసులు షాకిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 26న వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్ చలాన్లపై రాయితీ ఇస్తామని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy).. పెండింగ్ చలాన్ల రాయితీపై జీవో విడుదల చేశారు. అయితే డిసెంబర్ 26 నుంచే పెండింగ్ చలాన్లపై రాయితీ వర్తిస్తుందని ఆ జీవోలో సీఎం సృష్టం చేశారు..

అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది.. డిసెంబర్ 25 తర్వాత వాహనాలపై పడే చలాన్లు 100 శాతం చెల్లించాలని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. కానీ అందరూ డిసెంబర్ 25 తర్వాత కూడా వాహనాల చలాన్లపై రాయితీ ఉంటుందని భావించారు. అలా కుదరదని.. డిసెంబర్ 25 లోపు వాహనాలపై ఉన్న చలాన్లకు మాత్రమే రాయితీ వర్తిస్తుందని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు..

ఇలాంటి ఆఫర్ గత ప్రభుత్వం ప్రకటించగా.. భారీగా చలాన్లు వసులై రికార్డ్ సృష్టించిన విషయం తెలిసిందే.. ఇదే క్రమంలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం సైతం ఇదే దారిలో వెళ్తుందనే మాటలు వినిపిస్తున్నాయి.. కానీ పెండింగ్ చలాన్ల విషయంలో తక్కువ సమయాన్ని ప్రకటించడంతో కొందరు ఇంకా సమయం ఇస్తే బాగుంటుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు కోవిడ్ కారణంగా వెహికల్స్ ఓనర్స్ పెండింగ్ చలాన్లు చెల్లించపోయారు. కొన్ని వెహికల్స్ పై వాటి వ్యాల్యూ కంటే ఎక్కువ మొత్తం లో చలాన్లు ఉన్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ పరిధిలోని మూడు కమిషనరేట్లతో పాటు తెలంగాణ వ్యాప్తంగా వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లపై రాయితీని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా.. టూవీలర్స్, త్రీ వీలర్స్ పై 80 శాతం, టీఎస్ ఆర్టీసీ బస్సులపై 90 శాతం, లైట్ వెయిట్ లేదా హెవీ వెయిట్ మోటార్ వెహికల్స్, కార్లపై 60 శాతం రాయితీ ప్రకటించింది..

You may also like

Leave a Comment