ఒకవైపు సైబర్ నేరగాళ్లు.. మరోవైపు దోపిడి దొంగలు.. సమాజాన్ని హడలెత్తిస్తున్నారు.. ఇప్పటికే సైబర్ క్రైమ్ పెరిగిపోయిందని అధికారులు తలలు పట్టుకొంటుండగా.. దొంగతనాలు మరో సమస్యను తెచ్చిపెడుతున్నాయి.. క్షణం తీరిక లేకుండా పనిచేస్తున్న పోలీస్ అధికారులకు ఈ సమస్యలు సవాల్ గా మారాయి.. నిత్యం ఎక్కడో ఒకచోట జరుగుతున్న దొంగతనాలు జనాన్ని నిద్రలేకుండా చేస్తున్నాయి..
ఇంటికి తాళం వేసి వెళ్ళే పరిస్థితులు ప్రస్తుతం లేవని అధికారులు హెచ్చరిస్తోన్న విషయం తెలిసిందే.. అయితే దొంగలు ఇళ్ళతో పాటు బ్యాంకులను.. ఏటీఎంలను సైతం వదలడం లేదు.. ఈ క్రమంలో తాజాగా మహారాష్ట్ర (Maharashtra)లోని థానే (Thane)జిల్లాలో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానిక పోలీసుల కథనం ప్రకారం..
డోంబివాలి టౌన్షిప్లో సుమారు రాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఏటీఎంలోని డబ్బును దోచుకునేందుకు దుండగులు పక్కాగా ప్లాన్ వేశారు. ఈ క్రమంలో ఏటీఎం మిషన్ (ATM Mechine)ను తెరిచేందుకు గ్యాస్ కట్టర్‌ను ఉపయోగించారు. కానీ ప్రమాదవశాత్తు ఆ మంటలు కాస్త ఏటీఎం మిషన్‌లోని కరెన్సీకి అంటుకొన్నాయి.. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
ఈ విషయాన్ని స్థానికులు పసిగట్టడంతో అక్కడి నుంచి దుండుగులు పారిపోయినట్టు తెలిసింది. కాగా సమాచారం అందుకొన్న బ్యాంక్ అధికారులు.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొన్నారు. చోరీ జరిగిన విధానాన్ని పరిశీలించారు. మరోవైపు ఘటన జరిగిన సమయంలో ఏటీఎంలో దాదాపు రూ.21,11,800 నగదు ఉండొచ్చిన బ్యాంక్ అధికారులు అంచనా వేస్తున్నారు..