ఢిల్లీ(Delhi)లోని తీహార్ జైలు(Tihar Jail)లో ఖైదీల మధ్య గొడవ జరిగింది. ఖైదీలు(prisoners) ఒకరిపై ఒకరు సూదుల(Needles)తో దాడి చేసుకుని హల్‌చల్ చేశారు. ఈ ఘటనలో ముగ్గురు నలుగురు ఖైదీలు గాయపడినట్లు సమాచారం. ఈ ఖైదీలందరినీ ఒకే సెల్‌లో బంధించినట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. తీహార్ జైలు నంబర్ 3లో సోమవారం రెండు గ్రూపుల మధ్య ఈ వివాదం తలెత్తింది. ఖైదీల శబ్దం విన్న జైలు సిబ్బంది అక్కడికి చేరుకుని ఖైదీలను ఒకరికొకరు వేరు చేశారు. క్షతగాత్రులను వెంటనే సమీప దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రి(DDU Hospital)కి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఖైదీలు ఏదో ఒక సమస్యపై తరచూ గొడవ పడుతుండటంతో విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. గాయపడిన ఖైదీల వాంగ్మూలంపై కేసు నమోదు చేశారు. జైల్లో ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికే ఇరువర్గాల మధ్య పోరు సాగుతున్నట్లు జైలువర్గాలు చెబుతున్నాయి.
తీహార్ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ ఇదేం మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా తీహార్ జైలులో రెండు ముఠాలకు చెందిన దుండగులు పరస్పరం ఘర్షణ పడ్డారు. తీహార్ జైలు నంబర్ 1లో ఓ ఖైదీ మరొకరిపై కత్తి, టైల్‌తో దాడి చేశాడు. ఇరువర్గాల సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి.