Telugu News » Tirumala : నవనీత కృష్ణుడిగా చంద్రప్ర‌భ వాహ‌నంపై శ్రీవారు

Tirumala : నవనీత కృష్ణుడిగా చంద్రప్ర‌భ వాహ‌నంపై శ్రీవారు

బ్రహ్మోత్సవాల్లో భాగంగా మలయప్ప స్వామి (Malayappa Swamy) చంద్రప్రభ వాహనంపై ఊరేగారు. నవనీత కృష్ణుడి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు.

by Prasanna
chandra prabha

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో (Salakatlla Brahmostavalu) భాగంగా శ్రీ మలయప్ప స్వామి చంద్రప్ర‌భ (Chandraprabha) వాహ‌నంపై వెన్నముద్ద కృష్ణుడి అలంకారంలో భ‌క్తుల‌కు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మలయప్ప స్వామి (Malayappa Swamy) చంద్రప్రభ వాహనంపై ఊరేగారు. నవనీత కృష్ణుడి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. చంద్రప్రభ వాహనదారుడైన  శ్రీవారిని దర్శించడానికి భక్తులు పోటెత్తారు. వేలాదిమంది భక్తులు మలయప్ప స్వామిని దర్శించుకున్నారు. కన్నుల పండుగగా వాహనం ముందు భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలను నిర్వహించారు.

chandra prabha

వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు అన్నమయ్య కీర్తనలను ఆలపించారు. శ్రీవేంకటేశ్వరస్వామి, కృష్ణుడు, గోపికల వేషధారణలో కనిపించారు. వేదమంత్రోచ్ఛారణలతో తిరుమలగిరులు మార్మోగిపోయాయి.చంద్ర ప్రభ వాహనాలపై ఊరేగుతున్న స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగి సంపదలు సమకూరుతాయని భక్తులు విశ్వాసం.

చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. భక్తుల కళ్లు వికసిస్తాయి. భక్తుల హృదయాల నుండి ఆనందంతో నిండిపోతాయి. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుందని తిరుమల అర్చకులు తెలిపారు.

ఇవాళతో శ్రీవారి సాలకట్ల బ్రహోత్సవాలు చివరి దశకు చేరుకుంటాయి. ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహన సేవతో స్వామివారి వాహన సేవలు ముగుస్తాయి.

 

 

You may also like

Leave a Comment