ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కరెంట్ (Electricity) ఛార్జీల (Charges)పై పలు సందేహాలు మొదలైయ్యాయి.. ఈ క్రమంలో విద్యుత్ చార్జీలు పెరగనున్నాయా? గత ఏడాది చార్జీలు పెంచకపోవడంతో.. ఈ సారి పెంచే అవకాశం ఉందా? అనే చర్చ సాగుతుందని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఏపీ (AP) ఈఆర్సీ (ERC) విద్యుత్ వినియోగదారులకు ఊరట కలిగించే న్యూస్ చెప్పింది..
రాష్ట్రంలో విద్యుత్తు వినియోగదారులపై 2024–25లో ఎలాంటి విద్యుత్తు భారం పడకుండా డిస్కమ్ లు ప్రతిపాదనలు సిద్ధం చేశాయని తెలిపింది. రాబడి, వ్యయాలు సమానంగా ఉన్నందున.. సాధారణ ప్రజలతో పాటు పారిశ్రామిక వర్గాలపై ఎలాంటి భారం పడకుండా పాత టారిఫ్‌లనే కొనసాగిస్తున్నట్లు ఈ సందర్భంగా మూడు డిస్కమ్‌లు స్పష్టం చేశాయి..
ఈమేరకు వైజాగ్ (Vizag), ఏపీ ఈపీడీసీఎల్ కార్యాలయంలో ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి (Chairman Nagarjuna Reddy), సభ్యులు ఠాకూర్ రామ్ సింగ్, పీవీఆర్ రెడ్డి నేతృత్వంలో వర్చువల్ సమావేశం నిర్వహించారు.. ప్రజాభిప్రాయ సేకరణలో ఏపీఈఆర్సీ అధికారులతో పాటు ఇంధనశాఖ, ట్రాన్స్‌కో, జెన్కో, ఈపీడీసీఎల్, సీపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా వినియోగదారులకు మేలు చేసేలా కమిషన్ పారదర్శకంగా వ్యవహరిస్తోందన్నారు..
ఈ ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ పంపిణీ సంస్థలు ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదని.. అందువల్ల కొత్త ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ చార్జీల పెంపుదల ఉండదని స్పష్టం చేశారు. మరోవైపు ప్రజా విచారణలో భాగంగా ఏవైనా అభిప్రాయాలను తెలియజేయడానికి.. లేదా విచారణలో చర్చించాల్సిన సరైన అంశాలతో రావాలని ఈఆర్సీ చైర్మన్ తెలిపారు. ముందుగా APEPDCL వెబ్సైట్ apeasternpower.comలో వారి పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు..