Telugu News » Health Tips : టీ ఇలా తాగుతున్నారా.. అయితే మీరు రిస్క్ లో ఉన్నట్టే..!!

Health Tips : టీ ఇలా తాగుతున్నారా.. అయితే మీరు రిస్క్ లో ఉన్నట్టే..!!

నేటి జీవన విధానంలో ఒత్తిళ్లను తట్టుకోవడానికి ఎక్కువ మంది చాయ్ ని ఆశ్రయిస్తారు. అయితే దీన్ని ఒక్క సారి తీసుకొంటే ఫర్వాలేదని హెల్త్ ప్రొఫెషనల్స్ తెలియచేస్తున్నారు..

by Venu

వేడి వేడి టీ గొంతులోకి దిగనిదే కొందరికి దినచర్య మొదలవదు.. ఈ టీ (Tea) గొప్పదనాన్ని చెబుతూ కవులు పాటలు సైతం రాశారు.. మనిషి జీవితంలో అంతటి ప్రాముఖ్యతను సంతరించుకొన్న ఈ టీ వల్ల మైండ్ (Mind) కాస్త రిలాక్స్ అనిపిస్తోంది. కానీ మితిమీరి తాగితే అనార్థాలను కూడా కలిగిస్తోంది. చలికాలం కదా అని ఎక్కువగా సేవిస్తే మీరు అనారోగ్యాల బారినపడినట్టే అని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు..

అయితే టీని ఒక్కసారి తాగితే మంచిదని, అంతకన్నా ఎక్కువ సార్లు తాగితే ప్రమాదంలో పడతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. ఇలా అతిగా టీ సేవించడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయో వారు వివరంగా తెలియచేశారు.. నేటి జీవన విధానంలో ఒత్తిళ్లను తట్టుకోవడానికి ఎక్కువ మంది చాయ్ ని ఆశ్రయిస్తారు. అయితే దీన్ని ఒక్క సారి తీసుకొంటే ఫర్వాలేదని హెల్త్ ప్రొఫెషనల్స్ తెలియచేస్తున్నారు..

ఇక అదే పనిగా టెన్షన్ తో కప్పుల మీద కప్పులు చాయ్ లాగిస్తే మాత్రం శరీరంలో రోగ నిరోధక శక్తి (Immunity) తగ్గిపోతుందంటున్నారు. అలాగే శరీరంలో ఒత్తిడి, ఆందోళన పెరుగుతుందని, ముఖ్యంగా ఆకలి పూర్తిగా చచ్చిపోతుందని తెలియచేస్తున్నారు. ఇలా జరగడం వల్ల జీర్ణ సమస్యలు రావడంతో పాటుగా గ్యాస్, మలబద్ధక సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

అదీగాక గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు అసలు టీ ముట్టకూడదంటున్నారు.. కీళ్ల నొప్పుల నుంచి గొంతు నొప్పుల వరకు అన్ని వ్యాధులు ఈ చాయ్ వల్ల వస్తాయని, షుగర్ ఉన్న వాళ్లకు కూడా టీ మంచిది కాదని హెల్త్ ప్రొఫెషనల్స్ (Health Professionals) వివరించారు.. అందుకే రోజుకు ఒక్కసారి మాత్రమే టీ తాగితే ఆరోగ్యానికి మంచిదని హెచ్చరిస్తున్నారు..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్త పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించే ముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి.

You may also like

Leave a Comment