పార్లమెంట్ ఎన్నికల(Parliament elections)కు సమయం దగ్గర పడుతోంది.ఇప్పటికే దేశవ్యాప్తంగా మొదటిదశ పోలింగ్ (శుక్రవారం, ఏప్రిల్19)న పూర్తయిన విషయం తెలిసిందే. అన్ని చోట్లా పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లు ఈసీ(Election Commission) ప్రకటించింది. ఇకపోతే భారత పార్లమెంటుకు జరుగుతున్న ఎన్నికలకు ఇంకా ఆరు దశల్లో పోలింగ్ ప్రక్రియ జరగాల్సి ఉంది.
పొలిటికల్ పార్టీలు ఇప్పటికే ప్రచారంలో నిమగ్నమయ్యాయి. సభలు, సమావేశాలు, ప్రచారాలతో ప్రజలను ఆకట్టుకునేందుకు నేతలు నానా తంటాలు పడుతున్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో చాలా వరకు పార్టీలు పొత్తులతో ముందుకు వెళ్తున్నాయి. సింగిల్‌గా పోటీ చేస్తే జనాగ్రహాన్ని చూరగొనక తప్పదని వారికి అర్థం అయినట్లు తెలుస్తోంది.
ఇకపోతే దేశవ్యాప్తంగా పోలింగ్ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు చాలా మంది విధుల్లో ఉంటున్నారు. ఫలితంగా వీరికి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం లేకపోతోంది.వీరి ఓటు హక్కు ఒక ప్రాంతంలో ఉంటే మరొక ప్రాంతంలో వీరు ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు.
అది గ్రహించిన ఏపీ ఉద్యోగ సంఘాల(AP Employees leaders) నేతలు మే తొలి వారంలో పోస్టల్ బ్యాలెట్(Postal ballot) ద్వారా ఓటు హక్కును వినియోగించుకునేందుకు సెలవు ఇవ్వాలని కోరుతూ సీఈసీ ముకేశ్ కుమార్ మీనాను కోరారు. సిబ్బందిని పోలింగ్ కేంద్రాల వద్దకు ముందురోజు మధ్యాహ్నం చేర్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాయి. పోస్టల్ బ్యాలెట్ నమోదు, జారీ ప్రక్రియపై కొంతమంది అధికారుల్లో ఉన్న అనుమానాలను తొలగించాలని కోరాయి. కాగా, ఏపీలో నాలుగోదశ కింద మే 13న అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది.