ఏపీ బీజేపీ చీఫ్(Ap Bjp Chief) పురంధేశ్వరి(purandeshwari) ఏపీ ఆర్థిక అంశాలపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు(Nirmala seetharaman) వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీ అప్పుల ప్రకటన విషయంలో కేంద్రం తీరుపై పురంధేశ్వరి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వ అప్పు రూ.4.42 లక్షల కోట్లేనని కేంద్రం చెప్పడంతో ఏపీలో బీజేపీకి ఇబ్బందిగా మారిందని లేఖలో పురంధేశ్వరి పేర్కొన్నారు.
ఏపీ ఆర్థిక స్థితిపై మరింత క్లారిటీ కోసం ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని పురంధేశ్వరి కోరారు. ఏపీ ఆర్థిక స్థితిగతులపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఏపీలో మద్యం స్కాంపై జాతీయ దర్యాప్తు సంస్థలతో విచారణకు ఆదేశించాలని ఆమె తెలిపారు.
‘ఏపీ ప్రభుత్వ ఆర్ధిక అవకతవకలపై గతంలోనే ఫిర్యాదు చేశాం.. ఏపీ మొత్తం అప్పులు రూ. 10.77 లక్షల కోట్లు ఉంది. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ తీరు అలాగే కొనసాగుతోంది. ఏపీ ప్రభుత్వం చేసిన అధికారిక అప్పు రూ. 4.42 లక్షల కోట్లని కేంద్రం చెప్పడంతో ఏపీలో బీజేపీ ప్రతిష్టను వైసీపీ దెబ్బ తీస్తోంది.’ అని పురంధేశ్వరి పేర్కొన్నారు.
రాష్ట్ర భవిష్యత్తు, ప్రజా క్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులను భవిష్యత్తులో కట్టలేని తిప్పలు నుంచి బయట వేయాలనే బీజేపీ రాష్ట్ర శాఖ ప్రయత్నాలను తప్పుగా చిత్రీకరించారని ఈ పరిస్థితుల్లో ఏపీ ఆర్థిక పరిస్థితిపై కేంద్రం మరింత క్లారిటీ ఇవ్వాలని కోరారు. ఏపీలో మద్యం కుంభకోణం జరిదని ఆరోపించారు. మద్యం ద్వారా ఏడాదికి రూ.30వేల కోట్ల మేర ఆదాయం లెక్కలోకి రావడం లేదని నిర్మలతో పురంధేశ్వరి తెలిపారు.