కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) ఫేక్ వీడియోలపై మాటల వేడి ఇంకా తగ్గడం లేదు.. ఇప్పటికే ఈ వ్యవహారంలో తెలంగాణ (Telangana) సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)కి ఢిల్లీ (Delhi) పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.. దీనిపై ఘాటుగా స్పందించిన ఆయన.. సంచలన వ్యాఖ్యలు చేశారు.. కేసీఆర్ అమిత్ షాను ఆవహించినట్లున్నారని ఎద్దేవా చేశారు..
అందువల్లే ఢిల్లీ పోలీసులను గాంధీ భవన్కు పంపి, నన్ను అరెస్ట్ చేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రేవంత్ రెడ్డి భూపాలపల్లి జనజాతర సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఢిల్లీ పోలీసులను కాదు, సరిహద్దులోని సైనికులను తెచ్చుకున్న భయపడేది లేదని సవాల్ విసిరారు..
హామీల గురించి అడిగితే నాపై అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నట్లు ఆరోపించారు.. గుజరాత్ పెత్తనమా..? తెలంగాణ పౌరుషమా..? తేల్చుకుందామని ధ్వజమెత్తారు.. ఈ ఎన్నికలు గుజరాత్ పెత్తనానికి.. తెలంగాణ పౌరుషానికి మధ్య జరుగుతున్నాయని పేర్కొన్నారు.. బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒక్కటేనని ఆరోపించిన రేవంత్.. ఆ పార్టీతో కేసీఆర్ చీకటి ఒప్పందం చేసుకొన్నారని దుయ్యబట్టారు..
పార్లమెంట్ ఎన్నికల అయ్యాక బీజేపీతో కేసీఆర్ నడిపే భాగోతం బయట పడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.. నిండా మునిగి ఉన్న బీఆర్ఎస్కు ఒక్క ఓటు వేసిన అది వృధా అవుతుందని విమర్శించారు.. కారు కార్ఖానకి పోయింది.. బజార్లో తూకానికి అమ్మమాల్సిందే అంటూ సెటైర్ వేశారు. జనం ఛీ కొడుతున్నా బీఆర్ఎస్ పెద్దలు ఇంకా గుర్తించడం లేదని.. చీప్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు..