Find the latest Telugu news and political news in Andhra and Telangana in Telugu, తెలుగు రాజకీయ వార్తలు, పాలిటిక్స్ న్యూస్,
ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) తన యుఎఇ (UAE) పర్యటనలో భాగంగా వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2024లో పాల్గొనున్నారు. ఈ సమ్మిట్‌లో ప్రధాని మోదీ ప్రసంగానికి ముందు దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాను త్రివర్ణ దీపాలతో అలంకరించారు. భారతదేశ గౌరవార్థం అత్యంత ఎత్తైన భవనంపై ‘గెస్ట్ ఆఫ్ హానర్-రిపబ్లిక్ ఆఫ్ ఇండియా’ అని ప్రదర్శించారు. ఇలా భారత్ కు అరుదైన గౌరవం దక్కడంతో భారతీయులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
దుబాయ్‌లోని ప్రతిష్టాత్మకమైన బూర్జ్ ఖలీఫా (Burj Khalifa)పై భారత జాతీయ పతాకం (Indian Flag)తో పాటు ప్రధాని నరేంద్ర మోడీ పేరు, ఫొటోలను గ్రాండ్‌గా ప్రదర్శించి.. గౌరవ అతిథి – రిపబ్లిక్ ఆఫ్ ఇండియా’అంటూ.. ఘనస్వాగతం పలికారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ ఆహ్వానం మేరకు అబుదాబిలో పర్యటిస్తున్నారు.
ఈ సందర్బంగా దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్.. ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికారు. ఈ తరుణంలో ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. ఈ క్రమంలో రెండు దేశాల మధ్య ఉన్న దృఢమైన సంబంధాలు అంతర్జాతీయ సహకారానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని క్రౌన్ ప్రిన్స్ షేక్ పేర్కొన్నారు. అనంతరం ప్రధాని మోడీ దుబాయ్‌లో జరిగే వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2024లో గౌరవ అతిథిగా పాల్గొని ప్రసంగించనున్నారు.
మరోవైపు రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం యూఏఈకి వెళ్లిన ప్రధాని మోదీ అక్కడి ఉపాధ్యక్షుడు మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్‌తో భేటీ కానున్నారు.. అలాగే అబుదాబిలో తొలి హిందూ దేవాలయాన్ని నేడు ప్రారంభించారు. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా పాల్గొన్నారు.




