Find the latest Telugu news and political news in Andhra and Telangana in Telugu, తెలుగు రాజకీయ వార్తలు, పాలిటిక్స్ న్యూస్,
తెల్ల రేషన్ కార్డు ఉంటేనే పథకాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎందుకు చెప్పలేదని బీజేపీ ఎంపీ బండి సంజయ్(Bjp Mp Bandi Sanjay) ప్రశ్నించారు. ఆయన బుధవారం కరీంనగర్(Karimnagar)లో మీడియాతో మాట్లాడారు.
ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఆరు గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే పథకాలు అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పథకాల అమలులో కొర్రీలు పెట్టకూడదన్నారు. పథకాల అమలులో కొర్రీలు పెట్టకూడదన్నారు.
గత ప్రభుత్వం దుర్మార్గాలు చేసి ప్రజలను మోసగించిందన్నారు. కాంగ్రెస్ అలా చేయొద్దని బండి సంజయ్ సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ వ్యాఖ్యలపై బండి సంజయ్ మండిపాడ్డారు. భాష పట్ల నేతలు హద్దుల్లో ఉండాలని సూచించారు.
బీఆర్ఎస్ అహంకారం బయటకు వస్తోందని, సీఎం కుర్చీకి గౌరవం ఇవ్వాలని సూచించారు. ముఖ్యమంత్రినే చెప్పుతో కొడతామనడం సరైంది కాదని బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ నాయకులు హద్దు మీరుతున్నారని, సీఎంను అలా అనడం తప్పని అభిప్రాయపడ్డారు. ఇంతకంటే సిగ్గు చేటు ఉంటుందా? అని ప్రశ్నించారు.




