Find the latest Telugu news and political news in Andhra and Telangana in Telugu, తెలుగు రాజకీయ వార్తలు, పాలిటిక్స్ న్యూస్,
బీజేపీ (BJP)పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) చీఫ్, ఢిల్లీ సీఎం (Delhi CM) అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal).. తనను పార్టీలో చేరాలని బలవంతం చేస్తున్నట్లు వెల్లడించారు. వారు ఎన్ని జిమ్మిక్కులు చేసిన కాషాయ పార్టీకి ఎన్నటికీ లొంగిపోయే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నేడు ఢిల్లీలో రెండు పాఠశాలల భవనాలకు శంకుస్థాపన చేసిన అనంతరం కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా.. ఒత్తిడి పెంచినా వాటిని ధీటుగా ఎదుర్కొంటానని తెలిపారు. బీజేపీ నేతృత్వంలో, కేంద్ర ప్రభుత్వం జాతీయ బడ్జెట్లో 4 శాతం మాత్రమే ఖర్చు చేస్తుందని ఆరోపించిన కేజ్రీవాల్.. ఢిల్లీ ప్రభుత్వం ప్రతి ఏటా తన బడ్జెట్లో 40 శాతాన్ని పాఠశాలలు, ఆస్పత్రుల కోసం ఖర్చు పెడుతోందని వివరించారు. తనను జైలుకు పంపినా పాఠశాలల నిర్మాణం, ప్రజలకు ఉచిత వైద్యం వంటి అభివృద్ధి పనులు ఆగవని స్పష్టం చేశారు.
కేంద్రం తమపై కక్ష కట్టిందని విమర్శించారు.. స్కూళ్లు కట్టినందుకే మనీశ్ సిసోడియాను, మొహల్లా క్లినిక్‌లు నిర్మించినందుకే సత్యేందర్ జైన్లను జైలుకు పంపారని ఆరోపణలు చేసిన ఢిల్లీ సీఎం.. తనను కూడా అరెస్ట్ చేసేందుకు ఈడీ ప్రయత్నిస్తోందని తెలిపారు.. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 5 సార్లు ఈడీ పంపిన సమన్లను కేజ్రీవాల్ దాటవేశారు. దీంతో ఢిల్లీ రోస్ ఎవెన్యూ కోర్టుకు వెళ్లింది ఈడీ. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌కి రానున్న రోజుల్లో మరిన్ని చిక్కులు ఎదురయ్యేలా కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా ఢిల్లీ మంత్రి అతిశీకి ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన విషయంలో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నేడు నోటీసులు జారీ చేశారు. ఉదయం అతిశీ ఇంటికి వెళ్లిన పోలీసులు ఆమె లేకపోవడంతో కార్యాలయ సిబ్బందికి ఇచ్చారు. 24గంటల్లోగా దీనిపై స్పందించాలని ఆదేశించారు. కాగా ఈ అంశంపై స్పందించిన అతిశీ.. పార్టీని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపించారు. ఈసారి బీజేపీ ఆపరేషన్ కమలం 2.0ని ప్రారంభించిందని విమర్శించారు.


ఈమేరకు మున్సిపల్ శాఖ సీఎస్ దానకిషోర్ ఉత్తర్వులను జారీ చేశారు. 2010 తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఈమె.. ఇటీవల కేంద్రం నుంచి తెలంగాణకు తిరిగి వచ్చారు. అనంతరం హెచ్ఎండీఏ కమిషనర్‌గా రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. మరోవైపు డ్యాషింగ్ ఐఏఎస్ ఆఫీసర్‌గా పేరున్న ఆమ్రపాలి, విశాఖపట్నంలో చదివి యూపీఎస్సీ సివిల్స్‌లో 39వ ర్యాంకు సాధించింది.

