Find the latest Telugu news and political news in Andhra and Telangana in Telugu, తెలుగు రాజకీయ వార్తలు, పాలిటిక్స్ న్యూస్,
బెజవాడ కేశినేని బ్రదర్స్(Keshineni Brothers) మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎంపీ కేశినేని నాని(Nani)ని కాదని చిన్ని(Chinni)కి టికెట్ కేటాయించడంతో అగ్నికి ఆజ్యం పోసినట్లైంది. దీంతో టీడీపీకి గుడ్‌బై చెప్పిన నాని వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఎంపీ కేశినేని నానిపై టీడీపీ నేత కేశినేని చిన్ని తీవ్రంగా మండిపడ్డారు.
ఎంపీ కేశినేని నాని దేవినేని అవినాష్‌కు ముఖ్య అనుచరుడుగా మారాడని ఆరోపించారు. దేవినేని అవినాష్ ఎటు తిరిగితే ఆయన వెనుకే నాని కుక్కపిల్లలా తిరుగుతున్నాడని ఆయన విమర్శించారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో టీడీపీని ఖాళీ చేయడం కేశినేని నాని వల్ల కాదని చిన్ని అన్నారు.
కేశినేని నాని వైసీపీలోకి వెళ్లాక ముగ్గురు నలుగురు కూడా నాని వెంట లేరని ఎద్దేవా చేశారు. కేశినేని నానికి విజయవాడ ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కొడాలి నానిలా కేశినేని నాని కూడా దుర్భాషలాడుతున్నాడని తీవ్రంగా మండిపడ్డారు.
మేము గేట్లు తెలిస్తే వరదలా రావడానికి వైసీపీ నేతలు సిద్ధంగా ఉన్నారన్నారని హెచ్చరించారు. నాని మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శిస్తున్నారని చిన్ని మండిపడ్డారు. ఇకపై, వైసీపీ అరాచకపాలన ఎంతోకాలం సాగదని, దుష్ట పరిపాలన అంతమొందించడమే చంద్రబాబు లక్ష్యమని కేశినేని చిన్ని స్పష్టం చేశారు.




