Find the latest Telugu news and political news in Andhra and Telangana in Telugu, తెలుగు రాజకీయ వార్తలు, పాలిటిక్స్ న్యూస్,
రాష్ట్రంలో నూతన సంవత్సర వేడుకలు (New Year Celebrations) ఉత్సాహంగా నిర్వహించుకొంటున్నారు.. ఇందులో భాగంగా రాజకీయ నేతలు సైతం శుభాకాంక్షలు తెలియచేసుకొంటున్నారు.. ఈ క్రమంలో రాజ్ భవన్ (Raj Bhavan)లో గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ (Tamilisai Soundararajan)కి న్యూ ఇయర్ విషెస్ చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.. మరోవైపు రాష్ట్ర ప్రజలకి సైతం శుభాకాంక్షలు తెలిపారు..
రాజ్ భవన్ లో నిర్వహించిన ఓపెన్ హౌస్ కార్యక్రమానికి హాజరైన రేవంత్.. గవర్నర్ దంపతులకు పుష్ఫగుచ్చం ఇచ్చి విషెస్ చెప్పారు. రేవంత్ వెంట మంత్రులు కొండా సురేఖ, సీతక్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ ఉన్నారు. కాగా రేవంత్, రాజ్ భవన్ కు వెళ్లడం ఇదే తొలిసారి.. అంతకుముందు సెక్రటేరియట్ లో కొత్త ఏడాది హంగామా కనిపించింది.
మంత్రులు. మంత్రి సీతక్క, సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)ని కలిసి విషెస్ చెప్పారు.. ఇందిరాగాంధీ ఫోటోను బహుమతిగా ఇచ్చారు. అధికారులు, మినిస్టర్స్, పరస్పరం న్యూఇయర్ విషెస్ చెప్పుకొన్నారు. మరోవైపు సీఎంను కలిసేందుకు, అభిమానులు, జనం క్యూకట్టారు. సెక్రటేరియట్ చుట్టూ సీఎం కటౌట్స్ భారీగా ఏర్పాటు చేసి ఉత్సాహంగా కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకొన్నారు..




