Find the latest Telugu news and political news in Andhra and Telangana in Telugu, తెలుగు రాజకీయ వార్తలు, పాలిటిక్స్ న్యూస్,
తెలంగాణ రాష్ట్రంలో వరుసగా సంభవిస్తోన్న అగ్నిప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తోన్నాయి.. తాజాగా ఈ రోజు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ (Rajendranagar)లోని ఓ బేకరీలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఆర్ జీ పోలీస్ స్టేషన్ పరిధిలోని గగన్ పాడు కరాచీ బేకరీ (Karachi Bakery)లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలిన (Cylinder Blast) ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
ఈ ప్రమాదంలో 15మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.. కాగా బాధితుల్లో 8 మందిని కంచన్ బాగ్ డీఆర్డీవో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని బేకరీలోని మంటలు అదుపులోకి తెచ్చారు..
అప్పటికే విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో ఎక్కువ మంది ఉత్తర్ ప్రదేశ్ నుంచి వచ్చిన కార్మికులే ఉన్నారని పోలీసులు తెలిపారు.
మరోవైపు, ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడ్డ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడ్డ వారిలో ఎక్కువగా యూపీకి చెందిన వారే ఉన్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. ఇక ఈ రోజు కామారెడ్డి షాపింగ్మాల్లో అగ్నిప్రమాదం.. విశాఖపట్నం.. ఇండస్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే..



