Find the latest Telugu news and political news in Andhra and Telangana in Telugu, తెలుగు రాజకీయ వార్తలు, పాలిటిక్స్ న్యూస్,
సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో పలువురు ప్రముఖులు స్పందించారు. ప్రధాని మోడీ (PM Modi) ట్విట్టర్ లో అభినందనలు తెలిపారు. తెలుగులో ట్వీట్ చేసిన ఆయన.. ‘‘తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి అభినందనలు. రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తానని హామీ ఇస్తున్నాను’’ అని పేర్కొన్నారు. మరో ట్వీట్ లో ఇంగ్లీష్ లోనూ రేవంత్ రెడ్డికి విషెస్ తెలిపారు ప్రధాని.
రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మల్లు భట్టి విక్రమార్క, మంత్రులుగా ప్రమాణం చేసిన వారందరికీ ఆయన అభినందనలు తెలియజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేయాలని ఆకాంక్షిస్తున్నానని ట్వీట్ చేశారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు పరిపాలన కొనసాగించాలంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) అన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ తన బాధ్యతలు విజయవంతంగా నిర్వర్తించాలని ఆకాంక్షించారు లోకేష్.
మరోవైపు, రేవంత్ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అభినందనలు తెలియజేశారు. ఆయన నాయకత్వంలో, తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రేవంత్ తో పాటుగా ప్రమాణం చేసిన ఉప ముఖ్యమంత్రి, మంత్రులకు సైతం చిరంజీవి అభినందనలు తెలిపారు. ప్రజల ఆకాంక్షల మేరకు పరిపాలన కొనసాగించాలని పేర్కొన్నారు.




