Find the latest Telugu news and political news in Andhra and Telangana in Telugu, తెలుగు రాజకీయ వార్తలు, పాలిటిక్స్ న్యూస్,
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో(Telangana Assembly Elections) ఎవరూ ఊహించని రీతిలో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని కైవసం చేసుకుంది. ఇక సీఎం అభ్యర్థి ప్రకటనపై ఇవాళ సాయంత్రం వరకు ఓ క్లారిటీ వచ్చే చాన్స్ ఉంది. ప్రభుత్వ ఏర్పాటు, మంత్రులు, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాలపై కాంగ్రెస్ నేతలు బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ టాలీవుడ్ హీరోయిన్ కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు పట్ల సంచలన వ్యాఖ్యలు చేసింది.
టాలీవుడ్లో నచ్చావులే, స్నేహితుడా వంటి సినిమాల్లో నటించిన మాధవి లత(Madhavi Latha) తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఈ హీరోయిన్ టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీపై సోషల్ మీడియా వేదికగా అప్పుడప్పుడు తన అసహనాన్ని వ్యక్తం చేస్తుంది. అయితే ఈ బ్యూటీ రూట్ మార్చి రాజకీయాల గురించి మాట్లాడడం చర్చనీయాంశమైంది.
తాజాగా, మాధవీ లత ఇన్‌స్టాగ్రామ్‌లో తెలంగాణ రాజకీయాలపై తన అభిప్రాయాన్ని తెలిపింది. ‘తెలంగాణలో వచ్చే ఐదేళ్లలో జరగబోయే దారుణాలు ఇవే.. ఫుడ్ ఉండదు.. ఉద్యోగాలు ఉండవు.. మహిళలకు భద్రత ఉండదు.. శాంతి అసలే ఉండదు. ఎంజాయ్ చేయండి.. తెలంగాణ కాంగ్రెస్ లవర్స్‌కు గుడ్ లక్.. ఇక రావణ సామ్రాజ్యం మొదలు. కాంగ్రెస్‌తో పోలిస్తే బీఆర్ఎస్కు నా మార్కులు 99 నేను ఇస్తాను’’ అంటూ రాసుకొచ్చింది.
ప్రస్తుతం మాధవీలత పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో అది చూసిన కాంగ్రెస్ పార్టీ సపోర్ట్‌గా నిలిచిన వారు మండిపడుతున్నారు. మరోవైపు, బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న కాంగ్రెస్.. రాష్ట్రంలో ఎలాంటి పాలనను అందిస్తుందనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది.







