Find the latest Telugu news and political news in Andhra and Telangana in Telugu, తెలుగు రాజకీయ వార్తలు, పాలిటిక్స్ న్యూస్,
టాలీవుడ్ నటుడు, నిర్మాత అయిన బండ్ల గణేష్ (Bandla Ganesh) ఎప్పుడు ఏం మాట్లాడి షాకిస్తారో తెలియదని అంటుంటారు. తాజాగా ఇదే జరిగింది. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అంటే బండ్ల గణేష్ కి ఎంత ప్రేమ, అభిమానం ఉందో మనం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. సమయం వచ్చినప్పుడల్లా ఆయనే నిరూపించుకుంటాడు. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే బండ్ల గణేష్, పవన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు..
తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయంపై ధీమా వ్యక్తం చేసిన బండ్ల గణేష్.. ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ అభ్యర్ధి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం.. రెండు రోజుల ముందే ఆ స్టేడియంకి వెళ్లి పడుకుంటా అని వెల్లడించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో బండ్ల గణేష్, పవన్ కళ్యాణ్ గురించి కూడా కామెంట్స్ చేశారు.. పవన్ కళ్యాణ్-జనసేన పొత్తు గురించి నేను మాట్లాడటం ధర్మం కాదు.. పవన్ కళ్యాణ్ నా దేవుడే కానీ.. ఈ మాట బాధతో చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయకుండా ఉండి ఉంటే చాలా బాగుండేదని తెలిపారు.
పవన్ స్థాయి వేరు.. ఆయన్ని నేను ఎక్కడో చూడాలని అనుకుంటున్నా.. కానీ ఇక్కడే ఉంటున్నారని బండ్ల గణేష్ వ్యాఖ్యానించారు. ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ ని సీఎంగా చూడాలనేది నా కోరిక అని తెలిపిన బండ్ల గణేష్.. అసలు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఎవరు సార్..? పొలిటీషియన్ బ్యాక్ గ్రౌండ్ లేని సాధారణమైన మనిషి.. 20 ఏళ్లుగా ఒక్కో మెట్టూ ఎక్కుతూ.. ఈ రోజు తెలంగాణ రాష్టానికి ముఖ్యమంత్రి ఆయనే అనిపించుకునే స్థాయికి వెళ్లారని అన్నారు.
పవన్ కళ్యాణ్ రాజకీయం చేస్తే రేవంత్ రెడ్డిలా చేయాలని బోధ చేశారు బండ్ల గణేష్.. ప్రస్తుతం బండ్ల గణేష్ మాటలు విన్న పవన్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఎప్పుడూ దేవుడు అనే బండ్ల గణేష్ ఆయన గురించి ఒక్కసారిగా ఇలా మాట్లాడటం ఏంటని ఆలోచనలో పడ్డారు..




