Find the latest Telugu news and political news in Andhra and Telangana in Telugu, తెలుగు రాజకీయ వార్తలు, పాలిటిక్స్ న్యూస్,
ఎన్టీఆర్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. రాజకీయాలతో, సినిమాలతో కూడా ప్రజలకి దగ్గరయ్యారు. ఎన్టీఆర్ అటు రాజకీయాలు, ఇటుపక్క సినిమాలు రెండు చూసుకుంటూ ఆయన అద్భుతంగా రాణించారు. కేసీఆర్ టిడిపిలోకి ఎలా చేరారు అనే సందేహం కూడా చాలామందిలో ఉంది.
ఒకరోజు ఎన్టీఆర్ ని కలవడానికి కేసీఆర్ వెళ్లారు అప్పుడు ఏమైంది అనే విషయానికి వచ్చేస్తే… యూత్ కాంగ్రెస్ లో ఆయన ఉన్నానని మదన్ మోహన్ రావు గారు రాజకీయాల్లో కేసీఆర్ ని ఎదగనివ్వట్లేదని రామారావు గారు తనకి ఎంతో అభిమానం అని ఆయనని కలవడానికి వచ్చానని కేసీఆర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో చెప్పడం జరిగింది. ఆయనకి ఇష్టం లేకపోయినా కూడా షూటింగ్లో ఉన్న రామారావుని కలిసి ఎందుకు తీసుకువెళ్లారుట. అప్పుడు కేసీఆర్ ఎన్టీఆర్ ని కలిశారు ఎన్టీఆర్ చండశాసనుడు సినిమా షూటింగ్ అవుతోంది.
రామారావు గారితో కేసీఆర్ గురించి చెప్పారుట. టీడీపీలో కేసీఆర్ ప్రస్తావన ఇలా స్టార్ట్ అయింది. సిద్దిపేటలో మొదటిసారి పోటీ చేసి ఓడిపోయారు ఆ సమయంలో పార్టీ ప్రచారం అవుతోంది. పార్టీ ప్రచారం కోసం వెళ్తున్నప్పుడు ఏదో ఇబ్బంది అయింది. పడవ మీద వెళ్లాల్సి ఉంది టైం అడ్జస్ట్ చేసుకోలేకపోయారు ఎన్టీఆర్ గారు పడవలో వెళ్లారు. ఎన్టీఆర్ తో పాటుగా మేనక గాంధీ తదితరులు వెళ్లారు. కరీంనగర్ అయ్యాక జగిత్యాల లో కూడా ప్రచారం చేయడం జరిగింది. అయితే టైం సరిపోకపోవడంతో కొన్ని చోట్లను వదిలేశారట గెస్ట్ హౌస్ ముందు నుండి కారు ఎక్కడానికి వీలు కాకపోతే దొంగతనంగా మారువేషంలో ఎన్టీఆర్ గెస్ట్ హౌస్ వెనక నుండి కారు ఎక్కారు రామారావు.
Also read:
వెళ్తున్నప్పుడు సిద్దిపేట వచ్చింది సిద్దిపేటలో కార్ ఆపారు కేసీఆర్ మామూలుగా అయితే ముందు రోజు ఎన్టీఆర్ సిద్దిపేట వెళ్లాలి. కానీ టైం కుదరకపోవడంతో వెళ్ళలేదు. ఒకవేళ కనుక ఎన్టీఆర్ అనుకున్నట్లు ముందు రోజు వెళితే లక్షల్లో జనం ఉన్నారు. కానీ నిన్న వచ్చిన జనం అందరూ కూడా బాధపడి వెళ్లిపోయారని కేసీఆర్ రామారావు తో చెప్పారు. కెసిఆర్ ని ఎన్టీఆర్ ఓదార్చారు అలా ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయారు ఒకవేళ కనుక ఎన్టీఆర్ గనక టైం కి ప్రచారం చేసి ఉంటే కచ్చితంగా కేసీఆర్ గెలిచేవారుట.





