Find the latest Telugu news and political news in Andhra and Telangana in Telugu, తెలుగు రాజకీయ వార్తలు, పాలిటిక్స్ న్యూస్,
ఇంటి నుంచి బయటకి వెళ్ళితే తిరిగి క్షేమంగా ఇళ్లు చేరుకుంటామనే నమ్మకం లేని కాలంలో బ్రతుకు వెళ్లదీస్తున్నారు మనుషులు.. ప్రమాదం ఏక్షణం ఎటువైపు నుంచి దూసుకు వస్తుందో తెలియదు. ఇప్పటికే రోడ్డు ప్రమాదాలు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్న విషయం తెలిసిందే. తాజాగా లగ్జరీ బస్సు అదుపుతప్పి బోల్తాపడగా.. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా పలువురు గాయపడిన సంఘటన చింతపల్లి మండలంలో చోటుచేసుకుంది.
పోలీస్లు, స్థానికులు, తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ (Hyderabad)కు చెందిన కొందరు గుంటూరు (Guntur) జిల్లా వినుకొండ (Vinukonda)లో జరుగుచున్నపెళ్లికి హాజరై తిరిగి నగరానికి వస్తున్న క్రమంలో వీరు ప్రయాణిస్తున్న బస్సు అదుపు తప్పి చింతపల్లి మండల కేంద్రం నాగార్జున సాగర్ -హైదరాబాద్ హైవే లారీ అసోసియేషన్ ఆఫీస్ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది.
కాగా ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 నుండి 45 మంది ప్రయాణిస్తున్టట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. 15మందికి తీవ్ర గాయయ్యాయని పోలీసులు వెల్లడించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చింతపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, మరికొందరిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుంటున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.






