Find the latest Telugu news and political news in Andhra and Telangana in Telugu, తెలుగు రాజకీయ వార్తలు, పాలిటిక్స్ న్యూస్,
లండన్ (London)లో హృదయ విదారకమైన దుర్ఘటన చోటు చేసుకుంది. పశ్చిమ లండన్లోని హౌన్స్లోలో (Hounslow) జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు పిల్లలతో సహా ఐదుగురు కుటుంబ సభ్యులు మరణించారు. దీపావళి వేడుకలు చేసుకుంటుండగా అగ్నిప్రమాదం (Fire Accident) సంభవించినట్టు సమాచారం.
భారత సంతతికి చెందిన వీరంతా దీపావళి (Diwali) పండగను ఘనంగా జరుపుకున్నారని అంతలోనే అగ్నికి ఆహుతి అయ్యారని సమాచారం.. కాగా అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఇంటి యజమాని బావ, అతని భార్య, ముగ్గురు పిల్లలు, ఇద్దరు అతిథులు ఇంట్లో ఉన్నారని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. అగ్నిప్రమాదంలో ఒకరు గల్లంతయ్యారని, మరొకరికి గాయాలు అయ్యినట్టు తెలుస్తుంది. మరోవైపు మృతుల పేర్లను పోలీసులు ఇంకా వెల్లడించలేదు.
అయితే మెట్రోపాలిటన్ చీఫ్ పోలీస్, సీన్ విల్సన్ ఈ ప్రమాదంపై తీవ్ర సంతాపం వ్యక్తం చేసి.. ఘటనకు గల కారణాలను అన్వేషిస్తున్నట్లు తెలిపారు. ముందు జాగ్రత్తగా పరిసర ప్రాంతాలను ఖాళీ చేయించినట్టు వెల్లడించారు. కాగా ప్రమాదం విషయం తెలిసిన వెంటనే ఐదు అంబులెన్స్ తో పాటు సిబ్బంది, అధునాతన పారామెడిక్, ప్రమాదకర ఏరియా రెస్పాన్స్ టీమ్ సభ్యులతో సహా అనేక మందిని సంఘటన స్థలానికి పంపినట్లు లండన్ అంబులెన్స్ సర్వీస్ (London Ambulance Service ) తెలిపింది.




