Find the latest Telugu news and political news in Andhra and Telangana in Telugu, తెలుగు రాజకీయ వార్తలు, పాలిటిక్స్ న్యూస్,
చైనాలో (China) మంత్రుల తొలగింపు కొనసాగుతున్నది. ఇప్పటికే దాదాపు రెండు నెలలుగా కనిపించకుండా పోయిన చైనా రక్షణ శాఖ మంత్రి జనరల్ లీ షాంగ్ఫూను జిన్పింగ్ సర్కార్ తొలగించింది. ఈ తొలగింపుకు జాతీయ పీపుల్స్ కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీ కూడా ఆమోదం తెలిపిందని పేర్కొంది. అయితే షాంగ్ఫూ ఉద్వాసనకు కారణమేంటన్నది మాత్రం వెల్లడించలేదు.
తాజాగా ఆర్థిక మంత్రి (Finance Minister) లియు కున్ (Liu Kun) సైన్స్ అండ్ టెక్నాలజీ (Science and Technology) మంత్రి వాంగ్ జిగాంగ్లను (Minister Wang Zhigang) కూడా డ్రాగన్ సర్కార్ తొలగించింది. ఆయన స్థానంలో లాన్ ఫోయాన్ను నియమించింది. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి వాంగ్ జిగాంగ్ను తొలగించి.. ఆయన స్థానంలో యిన్ హెజున్ను నియమించినట్టు అధికారికంగా తెలిపింది.
ఇకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రిగా జూలై వాంగ్ 2012 న నియమితులయ్యారు. అనంతరం 2018లో క్యాబినెట్ మంత్రి హోదా పొందారు. కాగా, గత మార్చి నెలలో రక్షణ శాఖ మంత్రిగా నియమితులైన లీ షాంగ్ఫూను ప్రభుత్వం తొలిగించింది. ఆగస్టు 29న ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఆ తర్వాత బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. మరోవైపు వీరిద్దరూ జిన్పింగ్ అధికారాన్ని ప్రశ్నించినట్టు తెలుస్తుంది.


