తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ (Minister KTR).. రోడ్ షోలు, బహిరంగ సభలతో బిజీబిజీగా గడుపుతూనే.. సిటీలో ఓటర్లకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లో ఉన్న ఫేమస్ ప్రదేశాలను సందర్శిస్తున్నారు.

అనంతరం మొజంజాహీ మార్కెట్ (Mozamjahi Market)లో ఫేమస్ ఐస్‌క్రీమ్‌ను రుచి చూశారు కేటీఆర్. మరోవైపు కేటీఆర్ రాకతో రెండు ప్రాంతాలు సందడిగా మారిపోయాయి. కేటీఆర్ తో సెల్ఫీలు దిగేందుకు, కరచాలనం చేసేందుకు ప్రజలు ఎగబడ్డారు. కాగా ఈ పర్యటనకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్ వేదికగా (X)లో పోస్టు చేశారు కేటీఆర్. ప్రస్తుతం నెట్టింట ఈ పిక్ లు వైరల్ గా మారాయి.
మరోవైపు తెలంగాణ శాసనసభ ఎన్నికలకు (Telangana Assembly Elections) సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. విమర్శలకు ప్రతివిమర్శలతో సమాధానాలు ఇస్తూ.. ఎన్నికల సమరాన్ని రణరంగంగా మారుస్తున్నాయి.. ఈ సమయంలో నగరంలో అర్ధరాత్రి కేటీఆర్ ప్రజలతో కలిసిపోవడం వల్ల బీఆర్ఎస్ పై పాజిటివ్ వైబ్స్ ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు కొందరు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వివిధ వర్గాలను ఆకట్టుకునేలా హామీల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ఆరు గ్యారెంటీలకు అనుబంధంగా మరో 66 అశాలతో కూడిన మేనిఫెస్టో ప్రకటించిన కాంగ్రెస్.. మరో కీలక హామీ ఇవ్వడానికి సిద్దం అయ్యింది. ఈ క్రమంలో టీపీసీసీ (TPCC) చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth-Reddy) మరో కీలక హామీ ప్రకటించారు.
బస్తీ ప్రజలకు డబల్ బెడ్ రూమ్ ఇచ్చే దమ్ము కేసీఆర్ (KCR)కి లేదు కానీ గుడిసెలు వేసుకున్న వారి దగ్గర భూములు లాక్కొని పెద్దవాళ్ళకు కట్టబెడుతున్నారని ఈటల మండిపడ్డారు.. ఆనాటి ప్రభుత్వాలు ఎల్లమ్మబండలో ఉన్న 250 ఎకరాలలో 160 ఎకరాలు పేదలకు పంచాయి. మిగిలిన 92 ఎకరాలలో దేశ్ పాండే అనేవాడు రేకులు పాతే ప్రయత్నం చేసిండు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న నేను రేకులు పీకేసి ఇది ప్రభుత్వ భూమి నువ్వు ఎవడ్రా అంటూ అతన్ని అడ్డుకున్నానని ఈటల తెలిపారు.

