రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల మాతృమూర్తి మంజులమ్మ (77) గురువారం అనారోగ్యంతో కన్నుమూశారు. వేముల ప్రశాంత్‌రెడ్డికి (vemula prashanth) మాతృ వియోగం విషయం తెలుసుకొన్న పలువురు బీఆర్ఎస్ నేతలు నిజామాబాద్ (Nizamabad) జిల్లా, వేల్పూరు (Velpur)లో ఉన్న ఆయన నివాసానికి వెళ్తున్నారు.
ఈ క్రమంలో సీఎం (CM) కేసీఆర్ (KCR) కూడా మంత్రి నివాసానికి వెళ్లి మంజులమ్మ (manjulamma) భౌతిక కాయానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం మంత్రి వేములను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాగా సీఎం కేసీఆర్ వెంట స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
ఏడాది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మంజులమ్మను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యలు. అయితే చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్టు మంత్రి సన్నిహితులు తెలిపారు. కాగా గతంలో మంజులమ్మకు బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ జరిగింది. తర్వాత కోలుకున్నప్పటికీ మళ్లీ ఆరోగ్యం క్షీణించడంతో మృతి చెందారు.