ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో విషాద ఘటన చోటుచేసుకొంది.. అనకాపల్లి (Anakapalli)లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణానికి (Suicide) పాల్పడ్డారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.. గుంటూరు (Guntur) జిల్లా, తెనాలికి చెందిన, శివ రామకృష్ణ అనే స్వర్ణకారుడు తన కుటుంబంతో కలిసి అనకాపల్లిలో నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్యా, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు.
అయితే గురువారం రాత్రి వారంతా సైనైడ్ తాగినట్లు స్థానికుల సమాచారం.. దీంతో రామకృష్ణతో పాటు ఆయన భార్య మాధవి (38), కుమార్తెలు వైష్ణవి (16), లక్ష్మి (13) మృతి చెందారు. మరో కుమార్తె సుమప్రియ (13) అనకాపల్లి ప్రభుత్వ దవాఖానలో చావు బ్రతుకుల మధ్య ఉన్నట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకొన్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు.. కానీ ఆర్థిక సమస్యలతోనే వీరంతా బలవన్మరణానికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు.
మరోవైపు వేగంగా మారుతున్న కాలానుగుణంగా మనుషుల్లో ఊహించనంతగా మార్పులు రావట్లేదంటున్నారు. కాలానికంటే వేగంగా టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నప్పటికీ మనిషి మాత్రం ఒడిదుడుకులను ఎదుర్కొనలేక ఆత్మహత్య ఒక్కటే సమస్యకి పరిష్కారంగా భావించడం దురదృష్టకరం అని మానసిక నిపుణులు వెల్లడిస్తున్నారు..