Telugu News » Trump: ట్రంప్‌నకు బిగ్ షాక్.. అధ్యక్ష ఎన్నికలకు అనర్హుడిగా నిర్ణయం..!!

Trump: ట్రంప్‌నకు బిగ్ షాక్.. అధ్యక్ష ఎన్నికలకు అనర్హుడిగా నిర్ణయం..!!

2024లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి ట్రంప్‌ను అనర్హుడిగా ప్రకటిస్తూ మైనే రాష్ట్ర ఉన్నత ఎన్నికల అధికారి నిర్ణయం తీసుకున్నారు. కోర్టు తాజా తీర్పు ఆయన అభ్యర్థిత్వంపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి.

by Mano
Trump: Big shock for Trump.. The decision to disqualify him for the presidential election..!!

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌(Donald Trump)ను క్యాపిటల్ హిల్‌పై దాడి వ్యవహారం వెంటాడుతోంది. 2024లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి ట్రంప్‌ను అనర్హుడిగా ప్రకటిస్తూ మైనే రాష్ట్ర ఉన్నత ఎన్నికల అధికారి నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ(Republican Party) తరఫున ట్రంప్ మరో సారి బరిలో దిగనున్న విషయం తెలిసిందే.

Trump: Big shock for Trump.. The decision to disqualify him for the presidential election..!!

తాజాగా మైనే ఎన్నికల అధికారి నిర్ణయంతో ట్రంప్ రిపబ్లికన్ పార్టీ నుంచి తన రాష్ట్రంలో పోటీ చేయడానికి అనర్హుడయ్యారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు ట్రంప్‌నకు కొలరాడో కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు బిగ్ షాక్ అనే చెప్పాలి. ఇప్పటికే కొలరాడోకి చెందిన న్యాయస్థానం ఆయనపై నిషేధాన్ని విధించింది. 2021లో జరిగిన క్యాపిటల్ హిల్ దాడి కేసులో అనర్హుడిగా ప్రకటిస్తూ కోర్టు ఈ తీర్పునిచ్చింది.

2021లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విజయానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ హిల్‌పై దాడికి పాల్పడినట్లు కోర్టు వెల్లడించింది. ట్రంప్ మద్దతుదారులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాపిటల్ హిల్ దాడితో ట్రంప్ దేశ విద్రోహానికి పాల్పడినట్లు పలువురు కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

ఈ మేరకు కోర్టు తీర్పుపై జనవరి 4వరకు స్టే విధించారు. అనర్హత పడకుండా ఉండేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించాలని మాజీ అధ్యక్షుడి లీగల్ టీం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అయితే, కొలరాడో కోర్టు ఇచ్చిన తీర్పు ఆ రాష్ట్రానికి మాత్రమే పరిమితం కానుంది. మిగతా రాష్ట్రాలకు ఈ తీర్పు వర్తించదు. కోర్టు తాజా తీర్పు ఆయన అభ్యర్థిత్వంపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి. కొలరాడో ప్రైమరీ ఎన్నికలకు మాత్రమే తాజా తీర్పు వర్తిస్తుంది.

You may also like

Leave a Comment