Telugu News » TS Elections: ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితా విడుదల.. అత్యధికంగా అక్కడి నుంచే…!

TS Elections: ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితా విడుదల.. అత్యధికంగా అక్కడి నుంచే…!

ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన జాబితాలో అత్యధికంగా ఎల్‌బీనగర్‌లో 48 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఈసీ పేర్కొంది. అత్యల్పంగా నారాయణపేట, బాన్స్‌వాడ నియోజకవర్గాల్లో ఏడుగురు అభ్యర్థులు పోటీలు ఉన్నట్లు చెప్పింది.

by Mano
TS Elections: The list of candidates who stood in the election ring has been released.. Most of them are from there...!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో(Telangana Assembly Elections) 2,290 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నిన్నటితో ఉప సంహరణ గడువు ముగిసిన విషయం తెలిసిందే. ఈ మేరకు గురువారం ఎన్నికల కమిషన్‌(EC) అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. దాదాపు 608 మంది అభ్యర్థులు బుధవారం నామినేషన్లను ఉప సంహరించుకోగా.. 2,290 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచినట్లు ఎన్నికల కమిషన్‌ తెలిపింది.

TS Elections: The list of candidates who stood in the election ring has been released.. Most of them are from there...!

ఈ క్రమంలో ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన జాబితాలో అత్యధికంగా ఎల్‌బీనగర్‌లో 48 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఈసీ పేర్కొంది. అత్యల్పంగా నారాయణపేట, బాన్స్‌వాడ నియోజకవర్గాల్లో ఏడుగురు అభ్యర్థులు పోటీలు ఉన్నట్లు చెప్పింది. సీఎం కేసీఆర్‌ పోటీ చేస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గంలో 44 మంది అభ్యర్థులు, కామారెడ్డిలో 39 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

అలాగే మనుగోడులో 39 మంది, పాలేరులో 37 మంది బరిలో ఉన్నారు. సికింద్రాబాద్‌లోని కంటోన్మెట్‌ నియోజకవర్గంలో పది మంది పోటీలో ఉన్నారు. అయితే, ఎన్నికల సందర్భంగా 2,898 మంది అభ్యర్థుల నామినేషన్లకు ఈసీ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. నిబంధనల మేరకు 606 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యారు.

ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. సీఎం కేసీఆర్‌ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు ప్రజలను తాయిళాలు సమర్పించుకొని ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పార్టీలు నిమగ్నమైనట్లు తెలుస్తోంది.

 

You may also like

Leave a Comment