న్యూ ఇయర్(New Year)వేడుకలే టార్గెట్‌గా మత్తు పదార్థాల రవాణా జోరందుకుంది. దీంతో పోలీసులు అప్రమత్తమై హైదరాబాద్‌లోని పలు చోట్ల ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. టీ నాబ్ పోలీస్, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్, ఎస్‌వోటీ పోలీసులు రంగంలోకి దిగి మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఎస్‌ఆర్ నగర్, చైతన్యపురి, ఫిలింనగర్‌లో పలు ముఠాలను అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్(Hyderabad)లోని చైతన్యపురి(Chithanyapuri)లో మత్తు పదార్థాలు రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు భీమవరంకి చెందిన కునపరాజు, లక్ష్మీ నరసింహ రాజుతో పాటు హైదరాబాద్ జీడిమెట్లకు చెందిన జలిమ్, శ్యామ్ రాయ్ గా గుర్తించారు. ఇక, గోవాకు చెందిన డ్రగ్ పెడ్లర్ హాబీబ్ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఏపీ(AP)కి చెందిన భీమవరం, నెల్లూరు నుంచి మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. గడిచిన 24 గంటల్లో నగరంలో భారీగా మత్తు పదార్థాలను సీజ్ చేశారు. జూబ్లీహిల్స్ ఫిలింనగర్‌లో మాదకద్రవ్యాల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠా వద్ద హాష్ ఆయిల్, 70 గ్రాముల చెరాస్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.2.28 లక్షలు ఉంటుందని తెలిపారు.
అదేవిధంగా రాజస్థాన్ నుంచి మాదక ద్రవ్యాలను తీసుకువచ్చి హైదరాబాద్‌లో యువతులను టార్గెట్ చేస్తున్నట్లు సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. వారి వద్ద మత్తు పదార్థాలు ఓపీఎం 3. 4కేజీలు, 45గ్రాముల పాపీ స్ట్రాప్ పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నారు. శశిపాల్ బిష్ నాయ్, మదనలాల్ బిష్ బాయ్ అనే ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.